పెళ్లి‌పై ప్రశ్న, నా జీవితం కత్రినాకే అంకితమన్న రణబీర్

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్ మధ్య ఏదో 'సం'బంధం నడుస్తోందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరు విదేశాల్లో రహస్యంగా చట్టాపట్టాలేసుకుని తిరగడం, బీచుల్లో బికినీ వేసుకుని రణబీర్‌తో కత్రినా కనిపించడం లాంటి సంఘటనలు వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం బాలీవుడ్లో మొదలైంది. సెప్టెంబర్ 28న రణబీర్ బర్తే ఉండటంతో ఆరోజు వీరి ఎంగేజ్‌మెంట్ జరుపుకోవడానికి ప్లాన్ చేసుకున్నారని, అదే తమ పెళ్లి విషయం బయట పెట్టబోతున్నారని బాలీవుడ్ టాక్.


తమ మధ్య ఈ రేంజిలో వార్తలు ప్రచారంలోకి రావడంతో రణబీర్ స్పందించారు. కత్రినాకైఫ్‌తో తనకు నిశ్చితార్థం జరగబోతోందంటూ వస్తున్న వార్తలను రణబీర్ కపూర్ కొట్టిపారేశాడు. రణబీర్ కపూర్ పుట్టిన రోజు ఈ నెల 28న జరగనుంది . అదే రోజు రణబీర్, కత్రినా పెళ్లిపై ప్రకటన వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో తన పుట్టినరోజు నాడు పెళ్లి నిశ్చితార్థం ఏదీ ఉండదంటూ రణబీర్ కపూర్ స్పష్టం చేశాడు.

అయితే, 'ఎవరికి మీ జీవితం అంకితం చేస్తారంటూ' ఓ ప్రముఖ ఆంగ్లప్రతిక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా..... 'నా కుటుంబం, ఆర్యన్, కత్రినాకు' నా జీవితం అంకితం అని రణబీర్ వ్యాఖ్యానించారు. కత్రినా తన జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా పేర్కొన్నాడు. మరి వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏమిటో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X