తెలుగులో రీ ఎంట్రీ గురించి కత్రీనా కైఫ్ క్లారిఫికేషన్
ఎవరైనా మంచి కథ వినిపించినా ఒప్పుకోలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే తెలుగు సినిమాల్లో నటించే తీరిక లేదు అంటూ తేల్చి చెప్పేసింది కత్రానా కైఫ్. ఆమె తిరిగి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ....హిందీ తరవాత అంతటి గుర్తింపు ఉన్నది తెలుగు సినిమాలకే అని నాకు తెలుసు. అలాగే నాక్కూడా మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఉంది. అయితే కుదరడం లేదు. వరుసగా హిందీ చిత్రాలతోనే సరిపోతోంది. 'మల్లీశ్వరి' తరవాత 'అల్లరి పిడుగు' ఒక్కటే చేశాను. చేసినవి రెండు చిత్రాలే అయినా తెలుగు సినీ పరిశ్రమను ఎప్పుడూ మర్చిపోను. ఇక్కడ దర్శకనిర్మాతలు చూపించిన ఆదరణ అంతలా మనసుకి హత్తుకుపోయింది అంది. ఇక కత్రీనా రీసెంట్ గా 'తీస్ మార్‌ఖాన్' సినిమాలో చేసిన 'షీలాకీ జవానీ' పాట సినిమా ఫ్లాప్ అయినా పాట సూపర్ హిట్టయింది. ప్రస్తుతం ఆమె లక్స్ సబ్బుకి ప్రచారకర్తగా మారింది.


Click it and Unblock the Notifications











