»   » బాలీవుడ్ సెక్సీ భామ కోసం పోటిపడుతున్న స్టార్ హీరోలు..

బాలీవుడ్ సెక్సీ భామ కోసం పోటిపడుతున్న స్టార్ హీరోలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మల్లీశ్వరి", 'అల్లరి పిడుగు" చిత్రాలతో తెలుగులో రెండు ప్లాపులు చవిచూసి, మళ్ళీ టాలీవుడ్ పై దృష్టి పెట్టని బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కన్పించబోతోంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాతో కాదులెండి. ప్రస్తుతం మళయాలంలో రూపుదిద్దుకొంటున్న సినిమాని తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న 'మోనికా అండ్ ది డాన్" సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో కన్పించబోతున్నానని కత్రినాకైఫ్ స్వయంగా ప్రకటించేసింది. త్వరలోనే ఈ సినిమా తాలూకు పూర్తి వివరాలు చెబుతానంటోన్న కత్రినా, ఈసారి ఎలాగైనా సౌత్ లో సూపర్ హిట్ కొడ్తాననే ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇదిలా వుంటే, కత్రినాకైఫ్ కోసం తమిళ హీరోలు సూర్య, విజయ్ తెగ పోటీపడ్తున్నారు. ఆమె కోసం మరో తమిళ హీరో శింబు కూడా చాలాకాలంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ ముగ్గురిలో ఎవరి సరసన కత్రినా నటించినా, ఆ సినిమా తెలుగులోనూ విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ శింబు, సూర్య, విజయ్ ..ఈ ముగ్గురిలో ఎవరికి కత్రినా 'ఓకే" చెప్పిందో మరి..!

English summary
The tall and lanky model turned actress Katrina Kaif is coming to Tollywood once again. But this time she will regale her fans with a dubbed version of her film. She stared in a Malayalam film and it is now being dubbed into Telugu as ‘Monica and the Don’. Katrina had acted in two films in Telugu, one with Venkatesh and the other with Balakrishna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu