అరుంధతి హిందీ రీమేక్ హీరోయిన్ ఖరారు
తెలుగులో ఘన విజయం సాధించిన అరుంధతి చిత్రం త్వరలో హిందిలో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అరుంధతిగా అనూష్క ప్లేసులో అసిన్, ఐశ్వర్య రాయ్, విధ్యాబాలన్ పేర్లు వినిపించాయి. అయితే కత్రికాకైఫ్ ని ఆ పాత్రను చేయనున్నట్లు తెలిసింది. అరుంధతి చిత్రం చూసిన కత్రినాకైఫ్ వెంటనే ఓకే చేసినట్లు చెప్తున్నారు. అందులోనూ సౌత్ రీమేక్ లు హిందిలో బాగా వర్కవుట్ అవటంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం త్రీడీలో రూపొందనుందని సమాచారం. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు ఈ చిత్రాన్ని భారీ రేటు ఇచ్చి సొంతం చేసుకున్నారు.
అలాగే ఈ చిత్రం రైట్స్ కోసం బోనీకపూర్ చివరి వరకూ పోటీపడ్డారు. ఇక ఈ చిత్రం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో విజయం సాధించటం పరిగణనలోకి తీసుకునే జెమినీ వారు ఈ చిత్రాన్ని హిందీలో ప్లాన్ చేస్తున్నారు. త్రీడిలో అయితే మరింత హారర్ గా మారి నేషనల్ వైడ్ గా మంచి పేరు, డబ్బు తెస్తుందని ఆశించి కొన్నామని చెప్తున్నారు. ఇక ఈ విషయమై శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...ఈ చిత్రం హిందీలో కూడా పెద్ద విజయం సాధిస్తుందని, తెలుగు చిత్రాన్ని బీట్ అవుట్ చేస్తుందని భావిస్తున్నానని చెప్పారు.
ఇక ఈ చిత్రం సాంకేతిక నిపుణులు,ఆర్టిస్టులు ఎంపిక ఇంకా పూర్తికాలేదు. అనూష్క,సోనూసూద్ కూడా వారి స్టార్ కాస్టింగ్ లెక్కల్లో ఉన్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్సకుడు అనురాగ బసు తెరకెక్కించనున్నారు. అనురాగ బసు గతంలో గ్యాంగస్టర్, లైఫ్ ఇన్ మెట్రో, కైట్స్ చిత్రాలు డైరక్ట్ చేసి పేరు తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











