భాగ్యనగరంలో సందడి చేసిన కత్రినా
బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ రోజు హైదరాబాద్‌లో సందడి చేసింది. బషీర్‌బాగ్‌లో గీతాంజలి జ్యువెల్లర్స్ ఓపెనింగులో పాల్గొనేందుకు కత్రినా ముంబై నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. గీతాంజలి లైఫ్ స్టైల్ నక్షత్రా బ్రాండ్ షోరూంలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తోంది.
తాజాగా హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో కొత్త షోరూం ఏర్పాటు చేయడంతో దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ఎంతో అందమైనది, నన్ను అభిమానిస్తున్న ప్రేక్షకులు ఇక్కడ ఎంతో మంది ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది.
కాగా కత్రినాను చూసేందుకు జనం ఎగబడ్డారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో పాలరాతి శిల్పంలా సెక్సీ లుక్‌తో మెరిసి పోయింది కత్రినా. కాగా కత్రినా రాక సందర్భంగా ఆమె చుట్టూ గట్టి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆమె తిరిగి ముంబై బయల్దేరి వెళ్లి పోయారు.
ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్‍తో కలిసి 'ఏక్ థా టైగర్' చిత్రంలో నటిస్తోంది. గతంలో షీలాకీ జవానీ, చికిలీ చమేలీ ఐటం నంబర్లతో ప్రేక్షకులను ఫిదా చేసిన కైట్స్ తాజాగా 'మాషా అల్లాహ్' అనే సాంగు దుమ్ము రేపుతోంది. 'ఏక్ థా టైగర్' చిత్రం ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమౌతోంది.


Click it and Unblock the Notifications











