తెలుగు తెరపై మళ్లీ కత్రినా కైఫ్
తెలుగులో మల్లీశ్వరి,అల్లరి పిడుగు చిత్రాలతో అలరించిన కత్రినా కైఫ్ చిరకాల విరామం తర్వాత మళ్లి తెలుగు తెరపై కనిపించనుంది. కరుణ్ జోహార్ నిర్మించిన అగ్నిఫధ్ లో ఆమె నటించింది. ఆ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి వదులుతున్నారు. అలాగే కరణ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. ఈ చిత్రం జనవరి 26న విడుదల అవుతోంది. డర్టీ పిక్చర్ ని తెలుగులో డబ్ చేసి విడుదల చేసిన నిర్మాతలు ఈ చిత్రాన్ని కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇక అల్లరి పిడుగు అనంతరం ఆమెను తెలుగులో చాలా మంది నిర్మాతలు కలిసి అడగటం జరిగింది. అయితే ఆమె ఏదీ కమిట్ కాలేదు.
ఇక ఆమె రీఎంట్రి గురించి అప్పట్లో మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇప్పుడు నన్ను తట్టుకోగలుగుతుందా? ప్రస్తుతం నాకున్న పాపులారిటీకి తగ్గ పారితోషికం తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చుకోగలదా..? అంటూ తెగేసి చెప్పింది కత్రినా కైఫ్.ఆమెను కలిసిన మీడియా..మళ్లీ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడు పలకరిస్తారు అని అడిగితే ఇలా స్పందించింది.సరిగ్గా అదే సమయంలో ఆమె హిందీలో పూర్తి బిజీ కావటంతో ఇక్కడ మళ్ళీ చేయలేదు.అయితే అప్పుడప్పుడూ పెద్ద హీరోల కోసం ఆమెని సంప్రదించి నో అనిపించుకుంటున్నారు.అయితే దానికి కారణం రెమ్యునేషన్ అని క్లియర్ చేసింది.ఇక కత్రినా తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ ..తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. అద్భుతమైన పాపులారిటీని సొంతం చేసుకున్నాను. మంచి సబ్జెక్ట్ వస్తే... మళ్లీ తెలుగులో చేస్తా. సౌత్‌లో అందరూ ప్రొఫెషనల్‌గా ఉంటారు అంది. ఇంతకీ ఏ హీరో ప్రక్కన ఆమెను తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











