యాడ్ డీల్ : కత్రినాకు షాకింగ్ రెమ్యూనరేషన్
తన సెక్సీ బాడీతో, మత్తెక్కించే అభినయంతో దూసుకెలుతోన్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ యాడ్ రెమ్యూనరేషన్ విషయంలో రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఆమె పేయింటింగ్ ప్రొడక్ట్ బెర్జర్ తో భారీ డీల్ కుదుర్చుకుంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం సదరు కంపెనీ కత్రినా తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు గాను సంవత్సరానికి రూ. 7 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లలో బ్రాండ్ ఎండార్స్ మెంట్ల విషయంలో కరీనా కపూర్ టాప్ లో ఉంది. గతంలో ఆమె ఓ కోలా బ్రాండ్ తో రూ. 5 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. తాజాగా దాన్ని బీట్ చేసింది కత్రినా కైఫ్. కత్రినాకు సదరు కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ముందు రావడానికి కారణం ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో పాటు, సెక్సియెస్ట్ ఉమెన్ గా రికార్డులకెక్కడమే. ఇప్పటి వరకు కత్రినా చేతిలో 12 బ్రాండ్ ఎండార్స్ మెంట్లు ఉన్నాయి. ఈ విధంగా ఇటు సినిమాలతో అటు యాడ్లతో చేతి నిండా సంపాదిస్తోంది క్యాట్.
ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్ తో కలిసి 'ఏక్ థా టైగర్' చిత్రంలో నటిస్తోంది. ఆగస్టు 15న ఈచిత్రం విడుదల కాబోతోంది. ఇందులో కత్రినా చేసిన బెల్లీ డాన్స్ సాంగ్ 'మాషా అల్లాహ్' సినిమాకు హైలెట్ గా నిలవనుంది. ఈ మూవీ హిట్టయితే కత్రినాకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











