కత్రినా... ఆ ఇద్దరిని అధిగమించి సల్మాన్ రూట్లో!
హైదరాబాద్: బాలీవుడ్ హాట్ బ్యూటీ, సెక్సీయెస్ట్ ఉమన్ కత్రినా కైప్ తన అందాలకు ఉన్న డిమాండ్ ఏమిటో మరోసారి నిరూపించింది. తాజాగా ఈ భామ కరీనా కపూర్, ప్రియాంక చోప్రాలను అధిగమించింది. కేవలం ఓ ప్రైవేట్ ఫంక్షన్లో డాన్స్ చేసేందుకు ఆమెకు రూ. 3 కోట్ల ఆఫర్ వచ్చింది.
బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం... ఆర్గనైజర్లు ఇటీవలే ఆమెను కలిసి భారీ మొత్తం ఆఫర్ చేసారని, ఆమె నర్తించేందుకు అంగీకారం తెలిపిందని, ఆమె నటించిన హిట్ సాంగ్స్ 'ఇష్క్ షావా', 'చికినీ చమేలీ' లిరిక్స్ కు కరీనా హాట్ హాట్ డ్రెస్సులతో స్టెప్పులు వేయనుందని తెలుస్తోంది.
కత్రినాకు ఇంత డిమాండ్ ఏర్పడటానికి కారణం.... ఇటీవల ఆమె చేసిన చిత్రాలు, సాంగులు హిట్ కావడమే అంటున్నారు. ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఇటీవల వచ్చిన మంచి ఊపున్న సాంగుల్లో ఆమెవే ఎక్కువ ఉన్నాయట. మరో అభినందించ దగ్గ విసయం ఏమిటంటే.... ఈ షోద్వారా తనకు వచ్చే డబ్బులో కొంత మొత్తాన్ని ఓ స్వచ్చంద సంస్థకు ఇచ్చేందుకు సిద్ధం అవుతోందట. ఇలా చేయడం ద్వారా కత్రినా.... సల్మాన్ ఖాన్ ను ఫాలో అవుతుందని కొందరు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం కత్రినా 'ధూమ్-3' చిత్రంలో నటిస్తోంది. గతంలో వచ్చిన రెండు సిరీస్‌లలో ఇషా డియోల్, ఐశ్వర్య రాయ్, బిపాస బసులతో బికీని వేయించి రోమాన్స్ చేయించారు దర్శక నిర్మాతలు. తాజాగా ధూమ్3 లోనూ కత్రినాతో బికినీ వేయించి అమీర్ ఖాన్ తో రొమాన్స్ చేయించారట.


Click it and Unblock the Notifications











