twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్రినా బ్లూ ఫిల్మ్ డిటేల్స్

    By Staff
    |

    Katrina Kaif
    బ్లూ ఫిల్మ్‌ అంటే మాత్రం మీరూహించుకున్నట్లు నీలిచిత్రమేమీ కాదు. సంజయ్‌ దత్‌, అక్షయ్‌ కుమార్‌, లారా దత్తా, కత్రినా కైఫ్‌, జాయేద్‌ ఖాన్‌, రాహుల్‌ దేవ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం 'బ్లూ'. భారీ బడ్జెట్‌తో, యాక్షన్‌ తరహాకు చెందిన కథతో ఈ చిత్రం రూపొందించారు. అందులో ఒక పాటలో నటించేందుకు కత్రినా కైఫ్‌ కోటిన్నర రూపాయలు తీసుకుందనేది న్యూస్. ఐశ్వర్యారాయ్ రొబొలో నటించి హైయిస్ట్ పెయిడ్ ఇండియన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటూంటే కత్రినా ఈ సినిమా ద్వారా హైయిస్ట్ పెయిడ్ ఐటమ్ గర్ల్ పేరు తెచ్చుకోనుంది.

    శ్రీ అష్టవినాయిక ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు వందకోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.తెరపై ఐదు నిముషాలు కనిపించే ఓ పాట,రెండు సన్నివేశాల కోసం ఆమెకు దాదాపు కోటిన్నర చెల్లిస్తున్నట్లు సమాచారం. మొదట అసలు ఐటం గర్ల్ గా చేయమంటే కత్రినా రిజెక్టు చేసింది.

    అయితే వారు ఆఫర్ చేసిన డబ్బుని మాత్రం కాదనలేకపోయిందిట. అయితే ఐటం సాంగ్ చేస్తున్న విషయాన్ని ఆమె ఖండిస్తోంది. నేను బ్లూ సినిమా కోసం వెరీ స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వనున్నాను. దాన్ని నేను ఐటం సాంగ్ అని పిలవను. అయినా నేను ఈ వీరి షూటింగ్ కోసం పది రోజులు కేటాయిస్తున్నాను. అయితే పాట అయితే ఏడురోజులు సరిపోతుందని కదా అని వాదనకు దిగుతోంది.

    అష్టవినాయక సినీ విజన్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఆంటోనీ డిసౌజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో హక్కుల్ని టీ-సిరీస్‌ సంస్థ తీసుకొంది. త్వరలోనే పాటల్ని విడుదల చేయనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. చిత్రాన్ని దీపావళి రోజున విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X