»   » ప్రపంచంలోనే అత్యంత శృంగార వనితగా ఎంపికైన హీరోయిన్...!?

ప్రపంచంలోనే అత్యంత శృంగార వనితగా ఎంపికైన హీరోయిన్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచంలోనే అత్యంత శృంగార వనితగా (సెక్సీయస్ట్ వుమన్) బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ మరోసారి కిరీటాన్ని అందుకుంటోంది. ప్రముఖ లైఫ్ స్టయిల్ మేగజైన్ FHM నిర్వహించిన ఒక అభిప్రాయసేకరణలో కత్రినా ఈ ఘనతను సాధించింది. గత ఏడాది ఈ అవార్డుకు దీపికా పదుకొనే ఎంపికైంది. కాగా, 2008 , 2009 సంవత్సరాలకు కూడా కత్రినానే ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం.

తమ పత్రిక ప్రచురితమవుతున్న 28 ఎడిషన్ల లోనూ ఎప్పుడూ ఎక్కడా ఎవరూ ఈ అవార్డును కత్రినాలా ఇలా మూడుసార్లు గెలుచుకోలేదని పత్రిక ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ కబీర్ శర్మ తెలిపారు. ఇలా సెక్సీయస్ట్ వుమన్ గా ఎన్నిక కావడాన్ని బాలీవుడ్ తారలు పెద్ద అచీవ్ మెంట్ గా ఫీలవుతారు. అందుకే ఇటువంటి అవార్డుల కోసం ఆయాతారలు అర్రులు చాస్తారు.

English summary
Bollywood’s babelicious babe Katrina Kaif is still considered to be the hottest woman of all seasons. The actress has again topped the sexiest woman poll conducted by world’s famous men's lifestyle magazine FHM, for the third time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu