»   » ప్రభాస్‌, అనుష్కను విడగొట్టారు.. రిజెక్ట్ చేసిన హీరోయిన్‌ కోసం వెంటపడుతున్నారు..

ప్రభాస్‌, అనుష్కను విడగొట్టారు.. రిజెక్ట్ చేసిన హీరోయిన్‌ కోసం వెంటపడుతున్నారు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాహో చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క మరోసారి నటించనున్న అభిమానుల ఆశలపై ఆ చిత్ర నిర్మాతలు నీళ్లు జల్లారు. లావు ఎక్కువైందనే కారణంతో సాహో నుంచి అనుష్కను తప్పించినట్టు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అనుష్కను తొలగించినట్టు ఇటీవల ఓ జాతీయ వెబ్‌సైట్ ప్రచురించిన కథనం సినీవర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అనుష్కకు మంగళం పాడి ప్రస్తుతం మరోసారి బాలీవుడ్ హీరోయిన్‌ కోసం వెతుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ పక్కన కత్రినా అయితేనే సరిజోడి అనే మాట వినిపిస్తున్నది.

అనూహ్యంగా తెరపైకి అనుష్క

అనూహ్యంగా తెరపైకి అనుష్క

గతంలో శద్ధ్రాకపూర్, దిశాపటానీ, సోనమ్ కపూర్ తదితరులతో సంప్రదింపులు జరిపారు. ఓ దశలో కత్రినా కైఫ్ ఎంపిక ఖరారు అయినట్టు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత అనుష్క పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇటీవల అనుష్క సాహో టీమ్‌తో జత కలువనున్నదనే వార్త కూడా ప్రచారమైంది.

Baahubali Prabhas to romance Katrina Kaif in Saaho
అనుష్క, ప్రభాస్ కెమిస్ట్రీ కోసం..

అనుష్క, ప్రభాస్ కెమిస్ట్రీ కోసం..

గతంలో ప్రభాస్, అనుష్క నటించిన చిత్రాలకు భారీ విజయాన్ని సాధించాయి. బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో వారిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. దాంతో మరోసారి సాహో చిత్రంలో అలాంటి మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని నిర్మాతలు భావించారు. అందుకే అనుష్క వైపు మొగ్గు చూపించారు.

పరిగణనలోకి కత్రినా కైప్

పరిగణనలోకి కత్రినా కైప్

సాహోలో హీరోయిన్ ఎంపికపైగానీ, అనుష్క తొలగింపు వార్తలపై గానీ చిత్ర నిర్వాహకులు పెదవి విప్పలేదు. తాజాగా అనుష్కను తొలగించిన తర్వాత ప్రస్తుతం కత్రినా కైఫ్ పేరు తెరమీదకు వచ్చింది. ఇటీవల కత్రినాను చిత్ర నిర్మాతలు సంప్రదించారనే విషయం మీడియాలో నానుతున్నది.

ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిన కత్రినా

ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిన కత్రినా

గతంలో సాహో చిత్ర నిర్మాతలు కత్రినాను సంప్రదించగా ప్రభాస్‌తో నటించేందుకు నిరాకరించిందట. ఆమె అలా నిరాకరించడం వెనుక బలమైన కారణం ఉంది. సాహో కోసం కత్రినా కలిసినప్పుడు ప్రభాస్ నటించిన బాహుబలి2 చిత్రం రిలీజ్ కాలేదు. బాహుబలి2 రిలీజ్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏంటో దేశవ్యాప్తంగా తెలిసింది. మారిన పరిస్థితుల తర్వాత ప్రస్తుతం ప్రభాస్ పక్కన నటించేందుకు కత్రినా ఓకే చెప్పినట్టు తెలుస్తున్నది.

చిత్ర యూనిట్ స్పందిస్తే గానీ

చిత్ర యూనిట్ స్పందిస్తే గానీ

సాహో చిత్రంలో నటించేందుకు కత్రినా నిజంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మీడియాలో వచ్చే వార్తలన్నీ గాలి కబుర్లేనా అనే విషయంపై క్లారిటీ లేదు. సాహో చిత్రం నుంచి అనుష్కను నిజంగానే తప్పించారా అనే విషయంపై నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. ఆ గాసిప్స్‌కు తెరదించాలంటే సాహో చిత్ర యూనిట్ పెదవి విప్పితే గానీ అసలు విషయం తెలీదు.

English summary
It can be recalled that the Katrina Kaif was the first choice for a female lead in Prabhas starrer Saaho. When Katrina was approached by the Saaho makers, Baahubali 2: The Conclusion hadn't hit the theatres and Prabhas hadn't become the sensation that he is now. Later, we heard that after witnessing Baahubali 2 grand success, Katrina was regretting her decision of rejecting Saaho and had almost changed her mind.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more