ఈ దశాబ్దపు శృంగారభరిత దేహం...ఆ హీరోయిన్ దే
'ఈ దశాబ్దపు శృంగారభరిత దేహం' విభాగంలోనూ కత్రినా మొదటిస్థానాన్ని సొంతం చేసుకుంది. మిగతా ముద్దుగుమ్మలకంటే ఆమె ఒంపు సొంపులు చాలా బాగున్నాయని ప్రేక్షకులు తీర్పు చెప్పారు. ఈ దశాబ్దంలో బాలీవుడ్ కు సంబంధించిన వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపికచేయాలంటూ ఎమ్‌ఎస్‌ఎన్ ఇండియా తన ఆన్ లైన్ ప్రేక్షకులను కోరింది. 'ఈ శతాబ్దపు శృంగారభరిత జంట' ఎంపిక కోసం మొత్తం 38,648 మంది ప్రేక్షకులు స్పందించారు. వీరిలో 36 శాతం మంది సల్మాన్-కత్రినా వైపు మొగ్గుచూపారు. అభిషేక్-ఐశ్యర్య జంటకు 27 శాతం ఓట్లు పడ్డాయి. బిపాసా-జాన్ అబ్రహాం జంటకు 13 శాతం, సైఫ్-కరీనా జంటకు ఆరు శాతం ఓట్లు పడ్డాయి.
ఈ విభాగంలో బిపాసాకు 13 శాతం, ఐశ్వర్యా రాయ్‌కు 10 శాతం, ప్రియాంక చోప్రాకు తొమ్మిది శాతం ఓట్లుపడ్డాయి. ఈ దశాబ్దపు నటుడి విభాగంలో అత్యధిక మంది షారుఖ్‌కే (29 శాతం ఓట్లు) పట్టం కట్టారు. ఆమిర్ ఖాన్ కు కూడా 26 శాతం మంది ఓటేశారు. అమితాబ్ బచ్చన్ కు 16 శాతం మాత్రమే ఓట్లు రావడం గమనార్హం. రామ్ గోపాల్ వర్మ తీసిన ఆగ్ ను ఈ దశాబ్దపు వైఫల్య చిత్రంగా ఎంపిక చేశారు. తదుపరి స్థానాల్లో 'ద్రోణ', 'లవ్ స్టోరీ 2050', 'తషన్'లు నిలిచాయి. మర్డర్ లో ఇమ్రాన్ హష్మి-మల్లికా షెరావత్ జంట చేసిన ముద్దుల సీన్ ఈ శతాబ్దపు 'గాడఛుంబన' దృశ్యంగా ఎంపికయింది. మర్డర్ లిప్ లాక్ సీన్ కు 39 శాతం ఓట్లు పడ్డాయి. హృతిక్ రోషన్-ఐశ్వర్య ధూమ్, కుర్బాన్ లో సైఫ్-కరీనా, గురులో మాధవన్-విద్యా బాలన్ లు చేసిన లిప్ కిస్ లు తదనంతర స్థానాల్లో నిలిచాయి.


Click it and Unblock the Notifications











