హీరోయిన్ కత్రినా కైఫ్‌కు గాయాలు, కారణం అదేనా?
ముంబై: హీరోయిన్ కత్రినా కైఫ్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం తను నటిస్తున్న 'బాంగ్ బాంగ్' సినిమా షూటింగులో భాగంగా ఆమె డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కిండ పడి పోవడంతో ఆమెకు తీవ్రమైన కండరాల నొప్పి మొదలైనట్లు యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఈ చిత్రం మొదలు పెట్టినప్పటి నుండి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. సినిమా మొదలు పెట్టిన కొత్తలో ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న హృతిక్ రోషన్‌కు తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చింది. ఇప్పుడు కత్రినా కైఫ్‌కు గాయాలయ్యాయి. దీంతో సినిమా మొదలు పెట్టిన ముహూర్తం బాగోలేదనే టాక్ వినిపిస్తోంది.
సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు స్లైడ్ షోలో...

కత్రినా కైఫ్
బాంగ్ బాంగ్ చిత్రంలో ఓ సాంగు చిత్రీకరణలో భాగంగా డాన్స్ రిహార్సల్స్ చేస్తుండగా కత్రినా కైఫ్ గాయపడింది. ఆమె కాలి కండరాలు తీవ్రంగా పట్టేసినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

బాంగ్ బాంబ్
బాంగ్ బాంగ్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుజోయ్ ఘోష్-సురేష్ నాయర్ కథ అందించారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

తారాగణం
బాంగ్ బాంగ్ చిత్రంలో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, డానీ, జావేద్ జాఫ్రి, పవన్ మల్హోత్రా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్
బాంగ్ బాంగ్ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ మూవీ ‘నైట్ అండ్ డే' చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications











