twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్రినా కైఫ్ హాట్ వీడియో క్లిక్ చేస్తే...

    By Srikanya
    |

    తాజాగా చేసిన ఓ సర్వే ప్రకారం టాప్ టెన్ సెలబ్రేటీలు పేరుతో నెట్ లో ప్రవేశిస్తున్న వైరస్ లతో రోజు లక్షలాది మంది కంప్యూటర్స్ లోని సాప్ట్ వేర్స్ నాశనం అవుతున్నాయి.ఆ లిస్ట్ లో ప్రధమ స్ధానం కత్రినా కైఫ్. ఆ తర్వాత దీపికా పదుకోని, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యా రాయ్, బిపాసాబసు, అమీర్ ఖాన్, చివరలో షారూఖ్ ఖాన్ ఉన్నారు.వీరి బ్లూ ఫిలింస్, హాట్ వీడియోస్, హాట్ పిక్చర్స్ అంటూ నెట్ లో పెట్టే చాలా వాటిలో వైరస్ ఖచ్చితంగా ఉండి అది సిస్టమ్ కి చాలా దెబ్బ అని వారు తెలియచేస్తున్నారు. ప్రముఖ ఇంటర్ నెట్ సెక్యూరిటీ కంపెనీ మెకెఫీ వారు కత్రినా కైఫ్ హాట్ వీడియో అని ఉంటే గ్యారెంటీగా అందులో భయంకరమైన వైరస్ ఉండే ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు.

    ఆమే ఇండియన్ సైబర్ స్పేస్ లో మోస్ట్ డేంజరస్ సెలబ్రేటీ అంటున్నారు.ఎందుకంటే ఆమె సెర్చ్ ఇంజిన్ లో టాప్ ప్లేస్ లో రావటంతో సైబర్ క్రిమినల్స్ ఆమె పేరునే ఉపయోగించి, మానవ బలహీనత మీద దెబ్బ కొడుతున్నారని అంటున్నారు. గూగుల్ లో ఎక్కువ ఉపయోగించే కీ వర్డ్స్ లలో కత్రినా కైఫ్ ఒకటి కావటం వారు గమనించే ఇలాంటి దారణానికి ఒడిగడుతున్నారని చెప్తున్నారు.కాబట్టి పైన ఉదహరించిన సెలబ్రెటీల పేరులతో ఉండే హాట్ వీడియోస్,హాట్ పిక్చర్స్ జోలికి వెళ్లకపోవటం ఉత్తమమని చెప్తున్నారు.ఇక ఈ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ లేకపోవటం విచిత్రం.

    English summary
    Internet Security Company McAfee declaring that katrina kaif is the most dangerous celebrity in Indian Cyber Space.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X