కత్రినా బెల్లీడాన్స్ ‘మాషా అల్లాహ్’ కేక...
షీలాకీ జవానీ, చికిలీ చమేలీ ఐటం నంబర్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ మరోసారి తనకు తానే సాటి అని నిరూపించింది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'ఏక్ థా టైగర్' చిత్రంలోని కత్రినా చేసిన 'మాషా అల్లాహ్' అనే సాంగు దుమ్ము రేపుతోంది. ఈ పాటలో కత్రినా చేసిన బెల్లీ డాన్స్ కేక పుట్టిస్తోంది.
ఈ సంవత్సరం ఈ సాంగ్ టాప్ లిస్టులో చేరుతుందని మ్యూజిక్ అవర్స్ అంటున్నారు. ఇప్పటికే ఈ పాటకు యూట్యూబ్‌లో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకమైన పాటలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కత్రినా...ఈ సాంగ్ హిట్‌తో తన రేంజి మరింత పెంచుకుంది. ఇక కత్రినాను అందుకోవడం కేవలం బడా నిర్మాతల వల్ల తప్ప చిన్న నిర్మాతల వల్ల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
2008 సంవత్సరంలో విడుదలైన 'యువరాజ్' చిత్రంలో సల్మాన్, కత్రినాలు కలిసి నటించారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న 'ఏక్ థా టైగర్' చిత్రం ఆగస్టు 15 తేదిన విడుదలకు సిద్ధమౌతోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. ఈచిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మించారు.


Click it and Unblock the Notifications











