»   » సిస్టర్ మ్యారేజ్: కత్రినా కైఫ్ స్టన్నింగ్ లుక్(ఫోటోలు)

సిస్టర్ మ్యారేజ్: కత్రినా కైఫ్ స్టన్నింగ్ లుక్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన సోదరి క్రిస్టినా వివాహ వేడుక కోసం లండన్ వెళ్లింది. సోదరి మ్యారేజ్ కావడంతో ప్రస్తుతం తాను పాల్గొంటున్న షూటింగులన్నింటికీ కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది. లండన్లో తన వాళ్లతో కలిసి సందడిగా గడిపింది. తోడి పెళ్లి కూతురుగా పీచ్ గౌన్‌లో ఆమె స్టన్నింగ్ లుక్‌తో దర్శనం ఇచ్చింది.

పలు వెబ్ సైట్ల, వార్తా సంస్థలు కత్రినా సిస్టర్ నటాచా వివాహం అని వార్తలు కథనాలు వెలువరించారు. కానీ ఆ వార్తలు తప్పు అని....అది నటాచా వివాహం కాదని, మరో సోదరి క్రిస్టినా వివాహమని స్పష్టం అవుతోంది. ఆదివారం (ఆగస్టు 25)రోజున క్రిస్టినా వివాహం గ్రాండ్‌గా జరిగింది.

పెళ్లి వేడుక కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులలతో కత్రినా ఎంతో ఉత్సాహంగా గడిపింది. ఇంతకాలం బిజీ సినిమా షూటింగులతో గుక్కతిప్పుకోకుండా గడిపిన కత్రినాకు సోదరి వివాహంలో కావాల్సినంత రిలీఫ్ దొరికినట్లయింది. కత్రినా ఫేసులో ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించిందని అంటున్నారంతా.

అందమైన తోడిపెళ్లికూతుర్లు

అందమైన తోడిపెళ్లికూతుర్లు


కత్రినా కైఫ్ తన సిస్టర్ క్రిస్టినా వెడ్డింగ్ సందర్భంగా ఇతర తోడిపెళ్లి కూతుర్లతో కలిసి పీచ్ గౌన్లో ఇలా అందాల సుందరిలా దర్శనం ఇచ్చింది. పీచ్ గౌన్లో ఆమె లుక్ ఎంతో స్టన్నింగ్ గా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

తోబుట్టువుల ప్రేమానురాగాలు

తోబుట్టువుల ప్రేమానురాగాలు


పెళ్లి కూతురుతో పాటు...ఇతర తోడి పెళ్లికూతుర్లతో కత్రినా కైఫ్. వీరంతా కత్రినా కైఫ్ సిస్టర్సే కావడం గమనార్హం. అంతా ఎంతో చూడ ముచ్చటగా ఉన్నారు కదూ. సిస్టర్స్ అంతా కలిసి పెళ్లితో తెగ సందడి చేసారు.

లండన్లో...

లండన్లో...


తన సిస్టర్ మ్యారేజ్ సందర్భంగా లండన్ వెలుతున్న సందర్భంగా కత్రినా కైఫ్ ఇలా కెమెరాకు చిక్కారు. కత్రినా సోదరి క్రిస్టినా వివాహం ఆదివారం (ఆగస్టు 25) లండన్లో గ్రాండ్‌గా జరిగింది.

కత్రినా కుటుంబం

కత్రినా కుటుంబం


తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి కత్రినా కైఫ్ చిన్ననాటి ఫోటోను ఇక్కడ చూడొచ్చు. ఆమె ఫాదర్ ఇండియాలోని కాశ్మీర్ ప్రాంతం వాడు కాగా, తల్లి బ్రిటన్ పౌరురాలు.

రియల్ నేమ్

రియల్ నేమ్


కత్రినా కైఫ్ అసలు పేరు కత్రినా టురుక్యూట్‌. అయితే బాలీవుడ్ సినిమా రంగంలో ఎంటరయ్యే ముందు ఆమె తన పేరును కత్రినా కైఫ్ గా మార్చుకుంది. బాలీవుడ్లో తొలి నాళ్లలో కెరీర్లో కాస్త ఆటుపోట్లు ఎదుర్కొన్న కత్రినా...ఆ తర్వాత తనదైన టాలెంటుతో టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగింది.

English summary
Bollywood actress Katrina Kaif flew to London in between all her shooting schedules just to be there for her sister Christine's wedding. Even though the actress has been in India all these days, she was involved in planning different aspects of the wedding. Katrina, who was a bridesmaid at the wedding looked stunning in a peach gown.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu