కత్రినాకు యాక్సిడెంట్- చేతికి గాయం(ఫోటో)
ముంబై: బాలీవుడ్ సెక్సియెస్ట్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు యాక్సిడెంట్ అయింది. ఇటీవల ఆమె ముంబైలో జరిగిన 'రొమ్ము-అండాశయ కేన్సర్‌పై అవగాహణ' కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు తన కుడిచేయికి కట్టుకట్టుకుని కనిపించింది. దీంతో ఆమెకు యాక్సిడెంట్ అయిన విషయం బయటకు పొక్కింది.
బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆమె ప్రస్తుతం నటిస్తున్న 'ధూమ్-3' చిత్రంలో యాక్షన్ సీన్లు చేస్తుండగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో డూప్ లేకుండా కత్రినా స్వయంగా స్టంట్స్ చేస్తుండగా ప్రమాద వశాత్తు ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో 'ఏక్ థా టైగర్' చిత్రంలో కూడా కత్రినా స్వయంగా డేర్ డెవిల్ స్టంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
గతంలో వచ్చిన ధూమ్, ధూమ్2 సినిమాలు బాలీవుడ్‌లో భారీ బ్లాక్ బస్టర్స్‌గా పేలిన నేపథ్యంలో... థూమ్ 3 తీసేందుకు యశ్ రాజ్ ఫిలింస్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ లీడ్ రోల్ చేస్తున్నారు. అమీర్ సరసన సెక్సీ క్వీన్ కత్రినా లీడ్ రోల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











