»   » నాలుగోసారి ప్రపంచ శృంగార ఆసియా మహిళగా ఆమే

నాలుగోసారి ప్రపంచ శృంగార ఆసియా మహిళగా ఆమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్‌: ఏడాది నుంచి వెండితెరపై కనిపించకపోయినా వరసగా నాలుగోసారి ప్రపంచ శృంగార ఆసియా మహిళగా బాలీవుడ్‌ నటి కత్రినాకైఫ్‌ ఎంపికైంది. లండన్‌లోని ఈస్ట్రన్‌ ఐ న్యూస్‌పేపర్‌ నిర్వహించిన సర్వేలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, బుల్లితెర నటి ద్రష్టి దామినిలను అధిగమించి కత్రిన తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంది. ఈస్ట్రన్‌ ఐ సర్వేలోని 50 మంది శృంగార ఆసియా మహిళలు -2013 పూర్తి జాబితాను 6న విడుదల చేయనుంది.

''ఇది రికార్డు అని నాకు తెలియదు. చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది'' అని కత్రిన వ్యాఖ్యానించారు. బుల్లితెర నటి దామిని తొలి మూడు స్థానాల్లో ఉండడం, సనయా ఇరాని(6) టాప్‌ 10లో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఆషికి-2 ఫేం శ్రద్ధా కపూర్‌ (12) తృటిలో టాప్‌ 10లో చోటు దక్కించుకోలేకపోయింది. పాకిస్థాన్‌ నటి హ్యుమైమా మాలిక్‌కు 15వ స్థానం దక్కింది. బాలీవుడ్‌ అలనాటి తారలు మాధురి దీక్షిత్‌ (23), శ్రీదేవి (40) కూడా జాబితాలో ఉన్నారు.

Katrina Kaif

ప్రస్తుతం కత్రినా కైఫ్ అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'ధూమ్-3' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో కత్రినా సాహసాలు చేసే యువతిగా కనిపించబోతోంది. అందుకు తగిన విధంగా పూర్తి ఫిట్‌నెస్ సాధించింది కత్రినా. అదే సమయంలో తన బాడీలో గ్లామర్ మిస్సవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ధూమ్-3 చిత్రంలో కత్రినా కైఫ్ ఎంత హాట్ అండ్ సెక్సీ లుక్‌తో ఉందో స్లైడ్‌షోలో ఓ లుక్కేయండి. ఆమె అందం చూసి మీ మితిపోక తప్పదు.

ఈ సెక్సీ షేప్ లోకి రావడానికి, సినిమాలో తన టాలెంటు నిరూపించుకోవడానికి చాలా కష్టపడింది కత్రినా. 'ధూమ్-3' చిత్రంలోని టైటిల్ సాంగు కోసం ఎంతో కష్టపడి డాన్స్ ప్రాక్టీస్ చేసింది. కత్రినా ఏకంగా ఆరు వారాల పాటు ప్రాక్టీస్ చేసిందట. ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మెర్చంట్ కంపోజ్ చేసారు. ఓ స్టూడియోను ఆరు వారాల పాటు బుక్ చేసుకుని ప్రతి రోజూ 4 నుంచి 6 గంటల పాటు ప్రాక్టీస్ చేసారని తెలుస్తోంది. స్లైడ్ షోలో కత్రినా కైఫ్ హాట్ ఫోటోలు, సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు..

English summary
Katrina Kaif has been named as the World’s Sexiest Asian Woman of 2013 for the fourth consecutive time in a readers poll conucted by the UK publication, Eastern Eye. Kaif, secured the top spot in the world-renowned 50 Sexiest Asian Women List 2013, with actress and singer Priyanka Chopra coming in at second place, TV actress Drashti Dhami in third and fellow Bollywood actress Deepika Padukone in fourth. A permanent fixture in the top three for the past six years, the A-lister beat stiff competition from the world’s most stunning Asian women in the tenth edition of the UK based, Eastern Eye newspaper’s definitive ‘Sexy List’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu