డిజైనర్ గౌను కోసం రూ. 1 కోటి ఖర్చు పెట్టిన కత్రినా

By Bojja Kumar

హైదరాబాద్: కత్రినా కైఫ్, హృతిక్ రోషన్ జంటగా 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కోసం గేవిన్ మిగ్వెల్ కత్రినా కైఫ్ కోసం రెండు ప్రత్యేకమైన గౌన్లు డిజైన్ చేస్తున్నారు. అయితే ఆ రెండు గౌన్ల డిజైన్లకు ఏకంగా రూ. కోటి ఖర్చు అవుతుండటంతో ప్రొడక్షన్ తక్కువ రేటులో గౌన్లు తయారు చేయాలని సూచించింది. అయితే తన కోసం రూపొందిస్తున్న డిజైనర్ గౌన్లలో క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా ఉండటానికి తానే సొంతగా రూ. కోటి చెల్లించడానికి ముందు వచ్చిందట కత్రినా కైఫ్.

'బ్యాంగ్ బ్యాంగ్' చిత్ర విశేషాల్లోకి వెళితు...
హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా బాలీవుడ్లో 'బ్యాంగ్ బ్యాంగ్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. కత్రినా, హృతిక్ కలిసి నటిస్తున్నారంటేనే సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

స్లైడ్ షో బ్యాంగ్ బ్యాంగ్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు...

కత్రినా ఖర్చు హాట్ టాపిక్

కత్రినా ఖర్చు హాట్ టాపిక్


డిజైనర్ గౌన్ల కోసం కత్రినా కైఫ్ రూ. కోటి ఖర్చు పెట్టిందనే వార్తు ఇపుడు బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది.

కత్రినా, హృతిక్

కత్రినా, హృతిక్


చివరిసారిగా ఈ ఇద్దరు స్టార్స్ ‘జిందగీ న మిలేగి దొబారా' చిత్రంలో కలిసి నటించారు. ఆ చిత్రంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి ‘బ్యాంగ్ బ్యాంగ్‘ చిత్రంలో నటిస్తుండటంపై సర్వతా ఆసక్తి నెలకొంది. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదో భారీ బడ్జెట్ చిత్రం.

బ్యాంగ్ బ్యాంగ్

బ్యాంగ్ బ్యాంగ్


ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ ఫోటోకు సంబంధించిన కాన్పెప్టు కూడా ఆయన క్రియేటివిటీనే అని తెలుస్తోంది. ఇద్దరూ నీళ్లలో ఉండి కనిపిస్తున్న ఈ ఫోటోలో కత్రినా కైఫ్ హాట్ ఎక్స్ ప్రెషన్ ఆకట్టుకుంటోంది. తన ప్రియురాలి కళ్లలోకి చూస్తూ హృతిక్ గన్ పేలుస్తున్నట్లు ఈ ఫోటో డిజైన్ చేసారు. దీంతో పాటు హృతిక్ రోషన్ రగ్గడ్‌ లుక్‌తో ఉన్న సోలో ఫోటోను కూడా విడుదల చేసారు. ఇందులో హృతిక్ హాలీవుడ్ స్టార్ మాదిరి కనిపిస్తున్నారు.

విడుదల తేదీ

విడుదల తేదీ

ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సంబంధించిన ఫోటో షూట్ ముంబై సబర్బన్‌లోని ఓ స్విమ్మింగ్ ఫూల్‌లో నిర్వహించారు. ఇందుకోసం ఒక రోజు మొత్తం స్విమ్మింగ్ ఫూల్ బుక్ చేసారు. హాలీవుడ్లో టామ్ క్రూయిజ్, కామెరూన్ డియాజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘నైట్ అండ్ డే' చిత్రానికి రీమేక్‌‌గా ‘బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X