రూ. 4.5 కోట్ల టాక్స్ కట్టిన కత్రినా, సంపాదన ఎంతో?
ముంబై : బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ సంవత్సరం తన తోటి హీరోయిన్లందరి కంటే ఎక్కువ అడ్వాన్స్ టాక్స్ కట్టి వార్తల్లోకెక్కింది. అమ్మడు ఈ సంవత్సరం కట్టిన అడ్వాన్స్ టాక్స్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 4.5 కోట్లు. టాక్సే ఇంత మొత్తంలో కట్టిందంటే అమ్మడి సంవత్సర ఆదాయం ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఓ వైపు సినిమాలు, ఓ వైపు ఐటం సాంగులు, ఇవి కాకుండా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజిబిజీగా గడుపుతున్న కత్రినా.....సంపాదన విషయంలో అందరికంటే టాప్ రేంజికి చేరుకుంది. వరల్డ్ సెక్సీయోస్ట్ ఉమన్ గా మారిన దగ్గర నుంచి అందరి చూపులు కత్రినాపైనే. దీంతో ఆమెకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా సంపాదన కూడా పెరిగింది.
గత సంవత్సరం ఆమె నటించిన రెండు చిత్రాలు 'ఏక్ థా టైటర్' చిత్రంతో పాటు, 'జబ్ తక్ హై జాన్' చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాల జాబితాలో చేరాయి. మరో వైపు కత్రినా అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అత్యధికంగా సంపాదిస్తూ బాలీవుడ్ హీరోయిన్లలో టాప్ రేంజిక ఎదిగింది ఈ సెక్సీ లేడీ.


Click it and Unblock the Notifications











