బాలకృష్ణను ఇంకా మరిచిపోని కత్రినా కైఫ్!

అయితే కత్రినా కైఫ్ మాత్రం బాలకృష్ణను, ఆయనతో నటించిన 'అల్లరి పిడుగు' సినిమాను బాగా గుర్తు పెట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విలేకరులు ఆమెను.... 'మల్లీశ్వరి' తర్వాత తెలుగులో మళ్లీ ఏ సినిమా చేయలేదు. తెలుగులో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అందరూ ఆశ్చర్య పడేలా సమాధానం ఇచ్చింది కత్రినా.
'నేను మల్లీశ్వరి తర్వాత తెలుగులో రెండో సినిమా చేసాను. బాలకృష్ణతో అల్లరి పిడుగు చిత్రంలో నటించాను' అని సమాధానం ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో మరిచిపోయిన ఆ ప్లాపు సినిమా గురించి కత్రినా ఇంకా గుర్తు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్లో టాప్ 3 హీరోయిన్లలో ఒకరుగా తన హవా సాగిస్తోంది. ఆమె రెమ్యూనరేషన్ రూ. 5 నుంచి 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒక వేళ కత్రినా కైఫ్ తెలుగులో నటించడానికి ఒప్పుకున్నా, ఆమెకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చేంత సాహసం ఏ నిర్మాత చేస్తాడు?


Click it and Unblock the Notifications











