పుట్టినరోజంటే భయపడిపోతున్న స్టార్ హీరోయిన్

By Srikanya

ఇంకెప్పుడూ 2008 లాంటి పుట్టినరోజు నా జీవితంలో రావద్దని కోరుకొంటున్నాను. ఆ రోజును తలచుకొంటే ఇప్పటికీ భయమేస్తుంటుంది అని కత్రినా కైఫ్ చెప్పుకొచ్చింది. ఇంతకీ మీరు మర్చిపోలేని సంఘటన ఆ రోజు ఏం జరిగిందీ అంటే....ఆ రోజు అనుకోకుండా సల్మాన్‌..షారుఖ్‌ ఖాన్ ‌ల మధ్య మాటల యుద్ధం మొదలై పెద్దదై ఊహించని విధంగా పోగ్రాం మొత్తం పాడైంది. చివరకు అమీర్‌ ఖాన్‌ జోక్యం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది. అందులో ఇద్దరూ స్టార్ హీరోలే..ఎవరినీ ఏమీ అనలేం. ఆ తర్వాత ఆ మ్యాటర్ చాలా కాలం పాటు మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అనవరసంగా వాళ్ళద్దిరి మధ్యా పిలిచి తగువు పెట్టినట్లయింది. అందుకే లాస్ట్ ఇయిర్ నా పుట్టిన రోజును లండన్‌ లో మా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యే జరుపుకొన్నాను. ఈ ఏడాది కూడా ఇండస్ట్రీ వ్యక్తులని ఎవర్నీ వేడుకకు ఇన్వైట్ చేయదలచుకోలేదు. బహుశా ఈ సారి కూడా లండన్‌ లో మావాళ్లతోనే గడుపుతానేమో అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె పుట్టిన రోజు ఎప్పుడూ అంటారా...అది జులై 16.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X