కత్రినా కైఫ్.....ఊర నాటు
ఇటీవల విడుదలైన 'అగ్నిపథ్' సినిమాలో చికినీ చమేలీగా అభిమానులను ఊర్రూతలూగించిన బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్.....త్వరలో ఊరనాటు దేశీ గర్ల్ పాతక్రలో కనిపించనుంది. షారుఖ్ ఖాన్ హీరోగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే చిత్రంలో కత్రినా ఆ తరహా పాత్ర పోషించనుంది. ఇలాంటి పాత్రలు చేడయం అంటే కత్రినాకు మహా ఇంట్రెస్టు. అనుకోకుండా అదే పాత్ర తనను వెతుక్కుంటూ రావడంతో చాలా సంతోషంగా ఉంది ఈ లండన్ పాప. వాస్తవానికి ఈ పాత్రకు తొలుత ప్రియాంక చోప్రాను అనుకున్నప్పికీ చివరికి కత్రినా ఎంపికయింది.
ప్రస్తుతం కత్రినా మై కిషన్ హూ, ఏక్ థా టైగర్, యష్ చోప్రా నిర్మిస్తున్న చిత్రాల్లో నటిస్తోంది. అంతే కాకుండా 2013లో రాబోతున్న ధూమ్ 2, ధూమ్ 3 చిత్రల్లో కూడా హీరోయిన్‌గా ఎంపికయింది. పరిశ్రమకు వచ్చిన తొలి నాళ్లలో నటించడం సరిగారాదని విమర్శలు ఎదుర్కొన్న కత్రినా.....విమర్శకుల నోళ్లు మూయిస్తూ దూసుకెలుతోంది. ఇటీవల చికినీ చమేలీ చిత్రంలో మాస్ ఐటం గర్ల్‌గా అదరగొట్టిన ఈ భామ దేశీ గర్ల్ పాత్రకు పర్ ఫెక్టుగా సెట్టవుతుందని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











