నాకు పెళ్లైంది.. ఆ సమయం వస్తే కెరీర్ వెనుకబాటే?: కత్రినా సంచలన కామెంట్స్
పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్‌ను గతేడాది వరుస పరాజయాలు పలకరించాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'బార్ బార్ దేఖో', 'జగ్గా జాసూస్' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో చేసిన తాజా చిత్రం 'టైగర్ జిందా హై' బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో కత్రినా కెరీర్ మళ్లీ పట్టాలెక్కినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కత్రినా తన సినిమాలు, వ్యక్తిగత విషయాలపై పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

పెళ్లి.. పిల్లలు.. కెరీర్..:
ఒక స్టేజ్ వచ్చాక.. జీవితంలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన సందర్భం వస్తుంది. ఆ సమయంలో కెరీర్ వెనుకబడిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో మనం కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తాం. జీవితం మిక్స్ అండ్ మ్యాచ్‌లా ఉంటుంది.
Recommended Video


వివాహమైందనే భావిస్తున్నా..:
పెళ్లి విషయానికొస్తే.. నేనిప్పటికీ నాకు వివాహమైందనే భావిస్తాను. ఎందుకంటే ప్రస్తుతం నాకు సినిమాలే జీవితం. జీవితంలో పెళ్లి అనేది ఓ భాగం కావాలి. అంతేకానీ వచ్చే వ్యక్తి కోసం మనల్ని మనం కోల్పోకూడదు.

కెరీరే ముఖ్యం..:
హీరో రణ్‌బీర్-కత్రినాకు మధ్య కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం వీరిద్దరు బ్రేకప్ చెప్పేశారు. పెళ్లి గురించి అడిగితే.. ఇప్పటికైతే ఆ ఆలోచన లేదని, తనకు కెరీరే ముఖ్యమని కత్రినా చెబుతున్నారు.

టైగర్ జిందా హై:
సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ కాంబినేషన్‌లో వచ్చిన 'టైగర్ జిందా హై' బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే రూ.300కోట్ల పైచిలుకు కలెక్షన్స్ ఈ సినిమా కొల్లగొట్టింది. గతంలో సల్మాన్ నటించిన భజరంగీ భైజాన్ రూ.320.34 కోట్లు, సుల్తాన్ రూ.300.45 కోట్లను ఈ సినిమా అధిగమించేలా ఉంది.


Click it and Unblock the Notifications











