పాప్ స్టార్ షకీరా లా డాన్స్ చేసానంటున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తాజాగా తాను ప్రపంచ ప్రసిద్ది చెందిన పాప్ స్టార్ షకీరా లా డాన్స్ చేసానని స్టేట్ మెంట్స్ ఇస్తోంది. ఫర్హాన్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన తీస్ మార్ ఖాన్ చిత్రంలో షీలాకీ జవానీ సాంగ్ కి ఆమె షకీరాని అనుసరిస్తూ నడుము ఊపుతూ నృత్యం చేసి తన అబిమానులను అలరించే ప్రయత్నం చేసింది. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ....షకీరా మూవ్ మెంట్స్ చూసి ఈ డాన్స్ చేసానని, అలాగే తన డాన్స్ చూసి షకీరాతో పోలిస్తే చాలా సంతోషపడతానని, అలాగే ఈ క్రెడిట్ మొత్తం ఈ చిత్రం దర్శకురాలు కమ్ కొరియాగ్రాఫర్ అయిన పర్హాఖాన్ కే చెందుతుందని చెప్పుకొచ్చింది. ఇక అక్షయ్ కుమార్ హీరోగా చేసిన ఈ చిత్రం ఈ నెల 24 న విడుదల కానుంది. ఈ పాట చిత్రంలో హైలెట్ కానుందని యూనిట్ భావిస్తోంది.
కత్రినా కైఫ్ అక్షయ్ కుమార్ షకీరా పర్హాన్ ఖాన్ తీస్ మార్ ఖాన్ katrina kaif tees maar khan shakira farah khan


Click it and Unblock the Notifications