సల్మాన్ ఖాన్ తో విడిపోయిన కత్రినా కైఫ్
బాలీవుడ్ జంట సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ విడిపోయారు. ఈ విషయాన్ని కత్రినా కైఫ్ స్వయంగా వెల్లడించింది. 46 ఏళ్ల కండల హీరో సల్మాన్ ఖాన్ తో విడిపోవడం వల్లనే కత్రినా భద్రంగా ఉందనే మాట కూడా వినిపిస్తోంది. తాము ఎప్పుడు విడిపోయామనేది కచ్చితంగా చెప్పలేనని, తమ ఇద్దరి మధ్య అది జరిగిపోయిందని, అయితే తాము ఇతరుల వైపు దృష్టి సారించడం వల్ల అది జరిగిందనేది నిజం కాదని, ఇద్దరి మధ్య చేదు అనుభవాలేమీ లేవని కత్రినా ఓ టాబ్లాయిడ్ తో అన్నది. వారిద్దరు గతంలో చాలా సార్లు విడిపోయారని, అయితే ఈసారి ఆ క్రీడ ముగిసిపోయిందని, ఇప్పటికీ సల్మాన్ కుటుంబ సభ్యులతో కత్రినా సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నదని, సల్మాన్ సోదరి అల్విరాతో సన్నిహితంగానే మెలుగుతోందని, అది మారబోదని కత్రినా సన్నిహితులొకరు చెప్పారు. తమ సంబంధం ఏ స్థాయిలో ఉన్నదనే విషయమే చాలా మందికి సమస్యగా ఉన్నట్లుందని, అది ఇక ఎంత మాత్రం మాట్లాడుకునే విషయం కాదని, తన జీవితంలో చాలా జరిగేవి ఉన్నాయని, తాను కెరీర్ మీద దృష్టి కేంద్రీకరిస్తున్నానని కత్రినా చెప్పింది.


Click it and Unblock the Notifications











