Just In
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెంకీ హీరోయిన్ కత్రినా కైఫ్ కడుపు కహానీ..
బాలీవుడ్ సెక్సీభామ, టాలీవుడ్ 'మల్లీశ్వరి" కత్రినాకైఫ్ ఓ బాలీవుడ్ చిత్రం షూటింగ్ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో, ఆమెను హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం, ఆమెకు పొట్ట భాగంలో ఇబ్బందిగా వుండడంతో డాక్టర్స్ సర్జరీ చేయడం జరిగింది చాలా రోజుల క్రితం. అయితే అదిప్పుడు మళ్ళీ తిరగబెట్టడంతో మరోమారు షూటింగ్ టైమ్ లో కత్రినాకైఫ్ కడుపు నొప్పితో కుప్పకూలీపోయింది.
ఈ సారి, ఫరాఖాన్ ఫోర్త్ కమింగ్ మూవీ 'తీస్ మార్ ఖాన్" అనే సినిమా షూటింగ్ లో భాగంగా పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ టర్న్ డ్ డైరెక్టర్ ఫరాఖాన్, కత్రినాకైఫ్ తో బెల్లీ డాన్స్ చేయిస్తుండగా, డాన్స్ చేయలేక కత్రినా కడుపు నొప్పితో గుడ్లు తేలేసేసింది. ఈ ఊహించని సంఘటనతో షాక్ తిన్న యూనిట్ సిబ్బంది, వెంటనే కత్రినా కైఫ్ ని హాస్పిటల్ కు తరలించారట. ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
దాంతో మీడియా ముందుకొచ్చిన కత్రినా కైఫ్, తానేమీ షూటింగ్ సమయంలో కుప్ప కూలిపోలేదనీ, అసలు తనకేమీ కాలేదనీ, కష్టమైన స్టెప్స్ కావడంతో ఒకింత ఇబ్బంది పడిన మాట వాస్తవమే తప్ప, తనకెలాంటి అనారోగ్యం కలగలేదని వివరణ ఇచ్చుకుంది. అయితే గతంలో కత్రినాకైఫ్ కి సర్జరీ చేసిన వైద్యలు మాత్రం, ఆమె తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ముందు చాలా ప్రమాదమని హెచ్చరిస్తుండడం కొసమెరపు.