twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గూగుల్ సెర్చింగ్ లో ఆమె తర్వాతే అన్నాహజారే

    By Srikanya
    |

    ఈ సంవత్సరం ఎక్కువగా గూగుల్ లో సెర్చింగ్ చేసిన భారతీయులలో కత్రినాకైఫ్ మొదటి ప్లేసులో ఉన్నారు. ఆ తర్వాత ప్లేస్ లో అన్నా హజారే వచ్చారు. ఈ 2011 సంవత్సరంలో గూగుల్ సెర్చింగ్ ద్వారా ఏయే వ్యక్తుల గురించి,ఏయే అంశాలు గురించి నెటిజన్లు ఎక్కువ వెతికారు అన్న లెక్కల జాబితాను గూగుల్ విడుదల చేసింది. అందులో కరీనా కపూర్ ని దాటి కత్రినా మొదటి ప్లేస్ కి వచ్చింది. అలాగే అన్నాహజారే సైతం మిగతా వారికి పోటికి నిలిచి సెకెండ్ ప్లేస్ లో నిలిచారు. అలాగే అతి వేగంగా వార్తల్లో పైకెదిగిన వ్యక్తిగా సైతం అన్నా హజారేనే నిలిచి రికార్డు క్రియేట్ చేసారు.

    ఇక మూడవ ప్లేస్ లో మోడల్ పూనమ్ పాండే ఉంది. ఇక వార్తాంశాల విషయానికి వస్తే లోక్ పాల్ బిల్లు ఐదో స్దానంలో ఉంది. ఇక గతంలో ఐశ్వర్యారాయ్,కరీనా కపూర్ ఎక్కువగా గూగుల్ సెర్చింగ్ లో ఎక్కువ మార్కులు సాధించేవారు. ఈ సారి వారికి ఆ ప్లేస్ దక్కలేదు. మొత్తం కత్రినాకైఫ్ కొట్టుకుపోయింది. ఇక ఈ గూగుల్ ఎక్కువ శాతం సెర్చింగ్ మెట్రో నగరాల్లో కాకుండా నాన్ మెట్లోల్లో దాదాపు సెవెంటీ పర్శంట్ జరిగినట్లు పేర్కొంది. ఇంటర్నెట్ సేవలు పల్లెటూళ్లకు కూడా విస్తరించటంతో ఇది సాధ్యమైందని గూగుల్ తెలియచేసింది.

    English summary
    Katrina Kaif topped the chart in the category of 'Top Searched People' online. Hazare came second.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X