ఏంటి విషయం? కత్రినా కైఫ్ ఎందుకు దాస్తోంది? (ఫోటోస్)
హైదరాబాద్: కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ కలిసి గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఓ విలాసవంతమైన ఇల్లును అద్దెకు తీసుకుని అందులోనే ఉంటున్నారు. తాజాగా ఈ ఇద్దరికి నిశ్చితార్థం పూర్తయినట్లు వార్తలు వనిపిస్తున్నాయి.
తమ మధ్య సాగుతున్న ‘సం'బంధం గురించి అటు రణబీర్ కపూర్ గానీ, ఇటు కత్రినా కైఫ్ గానీ బయటకు చెప్పక పోయినా....ఇద్దరి మధ్య జరుగుతున్న విషయం గురించి జనాలకు ఎప్పుడో తెలిసి పోయింది. ఇద్దరు పెళ్లి కాకుండానే కాపురం చేస్తున్నారనేది బహిరంగ రహస్యం.
కాగా కత్రినా కైఫ్ ఇటీవల లండన్ లోని తన ఇంటికి వెళ్లింది. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి క్రిస్ మస్ వేడుకలను జరుపుకుంది. ఈ వేడుకల్లో రణబీర్ కపూర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరూ రింగ్స్ మార్చుకున్నారని, ఎంగేజ్మెంట్ జరిగి పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ వార్తల సంగతి అలా ఉంటే ఇటీవల ఇండియా వచ్చిన కత్రినా కైఫ్ ఫరా ఖాన్ బర్త్ డే పార్టీలోపాల్గొంది. ఈ పార్టీకి ఆమె అందాల దేవతాలా తెలుపు రంగు దుస్తుల్లో హాజరైంది. అయితే తన ఎడమ చేయి మీడియాకు కనిపించకుండా పాకెట్లో దాచేసింది. సాధారణంగా ఆమెకు అలా జేబులో చేయి పెట్టుకుని నడిచే అలవాటు లేదు. దీంతో ఆమె తన ఎంగేజ్మెంట్ రింగ్ దాస్తుందనే అనుమానాలు మొదలయ్యాయి. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు.

ఫరాఖాన్ బర్త్ డేలో కత్రినా కైఫ్
కత్రినా కైఫ్ బర్త్ డే పార్టీకి ఇలా అందమైన తెలుపు రంగు దుస్తుల్లో హాజరైంది కత్రినా. తన చేయి కనిపించకుండా ఇలా దాచేసింది.

హ్యాపీగా..
సాధారణంగా కత్రినా కైఫ్ ఇలాంటి సందర్భాల్లో కెమెరాలు తనను ఫోటోలు తీయడం ఇష్ట పడదు. అయితే ఈ సారి మాత్రం ఆమె మొహంలో సంతోషంగా కనిపించింది. ఇదంతా ఎంగేజ్మెంట్ అయిన ఆనందమే అంటున్నారు.

లండన్లో..
ఇటీవల లండన్లో కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

లుక్ అదిరింది
ఆ నిశ్చితార్తం గోల పక్కన పెడితే అమ్మడు ఈ స్లీవ్ లెస్ వైట్ డ్రెస్సులో మరింత అందంగా మెరిసిపోతోంది.


Click it and Unblock the Notifications











