కత్రినా వల్గర్ లేడీగా మారుతోందా?
బాలీవుడ్ హాట్ బేబీ కత్రినా కైఫ్ క్రమ క్రమంగా వల్గర్ డాన్సులు చేసే లేడీగా మారుతోందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది బాలీవుడ్ వర్గాల నుంచి. గత సంవత్సరం వచ్చిన తీస్ మార్ ఖాన్ చిత్రంలో 'శీలాకి జవాని' పాటతో ఐటం సాంగులు మొదలు పెట్టిన ఈ బాలీవుడ్ పాప క్రమ క్రమంగా ఐటెం బాంబుగా తన డిమాండ్ పెంచుకుంటోంది. కత్రినా ఐటం నెంబర్లకు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో ఆవిడ అడిగినంత ముట్టజెప్పి అలాంటి పాటలకు ఒప్పిస్తున్నారు దర్శక నిర్మాతలు.
తాజాగా అగ్నిపథ్ చిత్రంలో'చికిని చమేలి' పాట ద్వారా హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కత్రినా. ఇప్పటి వరకు కత్రినా ఐటం సాంగులు చేసినా...చాలా మోడ్రన్ లుక్ తో దర్శనం ఇచ్చింది. చికిని చమేలి ఈ పాటలో అమ్మడు ధరించిన డ్రెస్ చాలా సెక్సీగా ఉన్నప్పటికీ....ఈ వేషం చేస్తుంటే కత్రి మెల్లిమెల్లిగా వల్గర్ డాన్సులు చేసే బార్ గర్ల్ గా మారుతుందని అంటున్నారు. పక్క ఫోటోలో ఆవిడ డ్రెస్సు చూశారుగా. ఇలాంటి డ్రెస్సులు ఒకప్పుడు వ్యాంపు డాన్సులు, క్లబ్ డాన్సులు చేసే తారలు వేసి అందాలన్నీ ఆరబోసే వారు. ఇందుకు ఒకప్పటి బాలీవుడ్ క్యాబరే డాన్సర్ హెలెన్ ఒక ఉదాహరణ. ఆమె చాలా బాగా నర్తిస్తుందని అంతా ఒప్పుకుంటారు కానీ...వల్గర్ గా డాన్సులు చేసే ఆవిడతో పోల్చుకోవడానికి మాత్రం చాలా మంది తారలు ఇష్ట పడే వారుకాదు. కత్రినా తీరు, జోరు చూస్తుంటే బాలీవుడ్ తెరపై మరో హెలెన్ గా కత్రినా దర్శనం ఇవ్వడం ఖాయం అంటున్నారు.


Click it and Unblock the Notifications











