»   » మేడమ్ టుస్సాడ్స్‌లో...కత్రినా కైఫ్ మైనపు విగ్రహం (ఫోటో)

మేడమ్ టుస్సాడ్స్‌లో...కత్రినా కైఫ్ మైనపు విగ్రహం (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖుల మైనపు విగ్రహాలు కొలువు దీరిన లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇపుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు కూడా చోటు దక్కింది. ఇటీవలే ఆ విగ్రహాన్ని ఆమె ఇక్కడ ఆవిష్కరించింది. తన మైనపు విగ్రహం ఇక్కడ కొలువుదీరడం చాలా ఆనందంగా ఉందని, ఈ మైనపు విగ్రహాన్ని చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లే ఉందని కత్రినా కైఫ్ వ్యాఖ్యానించింది.

బ్రిటన్ పౌరురాలైన కత్రినా కైఫ్ తొలుత అక్కడే మోడల్ గా రాణించింది. ఆమె తల్లి బ్రిటన్ దేశస్తురాలుకాగా, తండ్రి కాశ్మీర్‌కు చెందిన వ్యక్తి. మోడలింగ్ రంగం నుండి అమ్మడు బాలీవుడ్లోకి అడుగు పెట్టి క్రమక్రమంగా ఇక్కడ స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. సెక్సియెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్ లాంటి దేశీయ భామలను వెనక్కి నెట్టింది.

Katrina Kaif unveils her wax statue at Madame Tussauds

31 ఏళ్ల కత్రినా కైఫ్..... మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చోటు దక్కించుకున్న 7వ బాలీవుడ్ సెలబ్రిటీ. ఈ మ్యూజియంలో తొలుత అమితాబ్ బచ్చన్ విగ్రహం(2000) కొలువుతీరగా, ఆ తర్వాత ఐశ్వర్యరాయ్(2004), షారుక్ ఖాన్(2007), సల్మాన్ ఖాన్ (2008), హృతిక్ రోషన్(2011), మాధురి దీక్షిత్(2012) విగ్రహాలు కొలువుతీరాయి.

‘మా ప్రపంచ ప్రఖ్యాత శిల్పులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో కలిసి దాదాపు దశాద్ద కాలంగా పని చేస్తున్నారు. బాలీవుడ్ కు సంబంధించిన మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలను మా మ్యూజియంలో చేరుస్తున్నాము' అని మేడమ్ టుస్సాడ్స్ ఓ స్టేట్మెంటులో వెల్లడించింది.

‘ఈ మైనపు విగ్రహం తయారీకి కత్రినా కైఫ్ మేడమ్ టుస్సాడ్స్ ఆర్టిస్టులకు ఎంతగానో సహకరించింది. ఆమె శరీర కొలతలు, జుట్టు,కళ్లు ఇలా నమూనాలు తీసుకున్నాం. చివరగా గోల్డ్, సిల్వర్ కలర్ గాగ్రా డ్రెస్ ఆమె విగ్రహానికి వాడాము' అని మ్యూజియం స్పోక్ పర్సన్ వెల్లడించారు.

‘కత్రినా కైఫ్ మైనపు విగ్రహం తయారు చేయడానికి దాదాపు 20 మంది శిల్పులు, ఇతర కళాకారులు నాలుగు నెలల పాటు శ్రమించారు. ముంబైలో ఉండి అనేక వందల రకాల కొలతలు తీసుకున్నారు. ప్రాసెస్ మొదలు పెట్టినప్పటి నుండి విగ్రహం మ్యూజియంలో కొలువుతీరే వరకు ఇప్పటి వరకు మొత్తం 150000 పౌండ్లు(రూ. కోటి 40 లక్షలు) ఖర్చయ్యాయ.

English summary
Bollywood actress Katrina Kaif has become the latest Indian star to join the Bollywood line-up at Madame Tussauds in London.The pretty actress unveiled the wax statue and joined the new Bollywood setting as part of the popular wax-work museum’s “15 years of Bollywood” celebration.
Please Wait while comments are loading...