తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కి మరో పురస్కారం దక్కింది. ఆసియాలోనే అత్యంత సెక్సియస్ట్ మహిళగా ఆమెకి అగ్రస్థానం కట్టబెట్టారు అభిమానులు. ఈస్ట్రన్ ఐ అనే బ్రిటీష్ వార పత్రిక నిర్వహించిన సర్వేలో ఈమె ప్రథమ స్థానాన్ని దక్కించుకొంది. గత ఏడాది తొలిస్థానంలో నిలిచిన బిపాసా బసు ఈ సారి రెండో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. మూడో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచింది. ఆ పత్రిక ఎడిటర్ హేమంత్ వర్మ మాట్లాడుతూ ''కత్రినది సహజ సిద్ధమైన అందం. అందుకే బాలీవుడ్‌లో ఆమె ఇంత తొందరగా అగ్రస్థానానికి చేరింది. ఆమె రూపం ఎవర్నైనా ఇట్టే ఆకర్షిస్తుంద''న్నారు. సల్మాన్ ఖాన్‌తో కత్రిన కలిసి నటించిన 'యువరాజ్' చిత్రం ఇటీవలే విడుదలైంది.ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్ద వర్కవుట్ కాకపోయినా కత్రినా అందాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.