ఆసియా సెక్సీయెస్ట్ మహిళ ఆ హీరోయిన్
ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆసియాలో సెక్సీయెస్ట్ మహిళ సర్వేలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా మొదటి స్ధానంలో నిలిచింది. ఆసియాలో 50 మంది అందగత్తెలెవరని బ్రిటన్‌కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే మేగజైన్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసియాలోని మిగతా అందగత్తెలను దాటి కత్రినా మొదటి స్థానంలో నిలిచి అందరినీ సంతోషపరిచింది. అలాగే ఆమె తరవాత మిగతా టాప్ టెన్‌లో 8మంది భారతీయ హీరోయిన్స్ ఉండటం విశేషం. కత్రినా తరువాత ప్రియాంకచోప్రా, ఫ్రిదాపింటో, కరీనా కపూర్, బిపాషాబసు, లారా దత్తా, ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకొనే నిలిచారు. ఇంతకుముందు కూడా కత్రినా ఈ తరహా అవార్డులను గెలుచుకుంది.కత్రినా తెలుగులో మల్లీశ్వరి,అల్లరి పిడుగు చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటించిన దే ధనాధన్ చిత్రం రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ మల్లీశ్వరీ వెంకటేష్ ఆసియా సెక్సీయెస్ట్ మహిళ katrina kaif salman khan malliswari venkatesh kareena kapoor bipasha basu


Click it and Unblock the Notifications