జిమ్ లో కత్రినా కైఫ్ కేక (హాట్ ఫోటోలు)
ముంబై: వెంకటేష్ సరసన "మల్లీశ్వరి"గా తళుక్కున మెరిసిన కత్రినాకైఫ్ గుర్తుండే ఉండే ఉంటుంది. ఆమె ఆ తర్వాత తెలుగులో బాలకృష్ణతో అల్లరి పిడుగు చేసి వర్కవుట్ కాకపోవటంతో మాయమైపోయింది.
ఆ తర్వాత బాలీవుడ్ సామ్రాజ్యానికి రారాణిగా నిలిచిన కత్రినా కైఫ్ అంద చందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వరల్డ్ సెక్సియెస్ట్ భామగా కూడా ఆమె కీర్తి కెక్కింది. ఎప్పటికప్పుడు తన అందాలకు పదును పెడుతూ అభిమానులను మత్తెక్కించే కత్రినా....తాజా చిత్రం ధూమ్ 3 కోసం వర్కవుట్స్ ప్రారంభించింది.
ప్రదీఫ్ భాటియా ట్రైనింగ్ లో ఆమె చాలా జాగ్రత్తగా వర్కవుట్స్ చేస్తూ,డైట్ మెయింటైన్ చేస్తోంది. వారంలో మూడు రోజులు...గంట చొప్పున ఆమె జిమ్ కు హాజరవుతోంది. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా ఆమె దీనిని మాత్రం మానటం లేదు. ఆమె జిమ్ ఫోటోలు తన ఆన్ లైన్ లో పెట్టింది. తన ఒంపుసొంపులను మరింత సెక్సీగా ప్రదర్శించిన ఫోటోలు విడుదలయ్యాయి.
స్లైడ్ షో ఆ ఫోటోలను వీక్షించండి.

ఓ వైపు సినిమాలు, ఓ వైపు ఐటం సాంగులు, ఇవి కాకుండా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజిబిజీగా గడుపుతోంది. కత్రినా.

అయినా తన ఫిటెనెస్ పై ఆమె శ్రద్ద అమోఘం, సంపాదన విషయంలో తన తోటి హీరోయిన్స్ అందరికంటే టాప్ రేంజికి చేరుకుంది. అయినా ఎప్పుడూ రిలాక్స్ కాదు. తన కొత్త చిత్రానికి ఏమేం కావాలో వాటికోసం ప్రిపరేషన్ చేస్తుంది.

వరల్డ్ సెక్సీయోస్ట్ ఉమన్ గా మారిన దగ్గర నుంచి అందరి చూపులు కత్రినాపైనే. దీంతో ఆమెకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా సంపాదన కూడా పెరిగింది. గత సంవత్సరం ఆమె నటించిన రెండు చిత్రాలు ‘ఏక్ థా టైటర్' చిత్రంతో పాటు, ‘జబ్ తక్ హై జాన్' చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాల జాబితాలో చేరాయి.
మరో వైపు కత్రినా అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో అత్యధికంగా సంపాదిస్తూ బాలీవుడ్ హీరోయిన్లలో టాప్ రేంజిక ఎదిగింది ఈ సెక్సీ లేడీ.

షూటింగ్ ల బిజీలో ఎంత రాత్రి అయినా జిమ్ కు వెళ్లటం మానదు. దాంతో ఆమె సహచరులు ఆమె డెడికేషన్ కి ఆశ్చర్యపోతున్నారు.

ధూమ్-3 లో కత్రినా ఈ గెటప్ లోనే కనపించనుంది.


Click it and Unblock the Notifications











