బాగా దగ్గర వాళ్ళకే మన వీక్నెస్ లు తెలుస్తాయి. అదే పద్దతిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు సల్మాన్ ఖాన్ బలహీనతలు అన్నీ పట్టేసుకుంది. అదే విషయాన్ని ఓ లోకల్ టాబ్లాయిడ్ లో వివరించింది. సల్మాన్ ఖాన్ కి దగ్గరవ్వాలంటే చాలా సులభమంటూ వివరించింది. పైకి అతను చూడ్డానికి టఫ్ గా కనపడతాడుగాని తేలిగ్గా బుట్టలో పడిపోతాడంటోంది. అతని దగ్గర కెళ్ళి చాలా భాధగా ఫేస్ పెట్టి నాకు ప్రెండ్స్ ఎవరూ లేరు ఎవరూ నన్ను ఇష్టపడటం లేదు అని చెబితే చాలు బస్...పని అయిపోతుంది. సల్మాన్ వెంటనే కౌగిలించుకుని ఎడాప్ట్ చేసుకుంటాడని చెప్తోంది. ఇక అతనిది గోల్డెన్ హార్ట్ అని చెబుతోంది. అందుకే అంత ఫ్లాఫ్ స్ధితిలో కూడా సుభాష్ ఘయ్ కి అండగా ఉంటానని హామి ఇచ్చాడంటోంది. అయినా యువరాజ్ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటాన్ని తట్టుకోలేకపోతున్నాడంటూ వివరించింది. అయినా సల్మాన్ వీక్నెస్ లన్ని తెలుసు కాబట్టే అతన్ని ఎన్ని మాటలైనా అంటోంది అంటున్నారు ఇది విన్నవారంతా.