రివర్స్ గేర్: ఆమె నో..తప్పేదేముంది హీరో గారు నో
ముంబై : తన ప్రియురాలు కత్రినా కైఫ్‌ను వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను రణ్‌బీర్ కపూర్ ఖండించాడు. ''కత్రినాను ప్రేమిస్తున్న మాట నిజమే. సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్నందువల్ల పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. వచ్చే ఏడాది మేం పెళ్లి చేసేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు'' అని రణ్‌బీర్ చెప్పాడు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మరో ప్రక్క పెళ్లి విషయమై వస్తున్న వార్తలపై కత్రినా స్పందిస్తూ ‘నేను,రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తలు పుకార్లు మాత్రమే. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. 2106లో పెళ్లి చేసుకోవడం లేదు. నేను పెళ్లికి సంబంధించిన ఎలాంటి ప్లాన్‌ను చేసుకోలేదని తెలిపింది. ఈ విషయాన్ని కత్రినా తన ప్రతినిధి ద్వారా మీడియాకు తెలియజేసింది.

రెండు రోజుల క్రితం...
రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ కలిసి సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఓ రీజనల్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...''కత్రినాతో ప్రేమలో ఉన్న విషయం నిజమే. సినిమా కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి పుకార్ల నుంచి దూరంగా ఉండాలనుకున్నాను. అందుకే మా ప్రేమ గురించి ఇన్నాళ్లూ మాట్లాడలేదు. ప్రస్తుతం నేను, కత్రినా సినిమాలతో బిజీగా ఉన్నాం. అందుకే వచ్చే ఏడాది(2016) ఆఖరులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం'' అని చెప్పాడు రణ్‌బీర్.
వాస్తవానికి ...రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల ఇద్దరూ తొలిసారిగా కలసి నటించిన 'అజబ్ ప్రేమ్ కీ ఘజబ్ కహానీ' సమయం నుంచే వారి మధ్య బంధం అల్లుకుంది. కానీ ఇన్నాళ్లూ తమ ప్రేమ విషయం బయటపడకుండా ఇద్దరూ జాగ్రత్తపడ్డారు. అయితే వారు రహస్యంగా షికార్లు చేస్తున్న ఫొటోలు మీడియాకు చిక్కడంతో ఇద్దరి మధ్య 'సమ్ థింగ్' అన్న ప్రచారం మొదలైంది. రణబీర్ ఈ విషయాన్ని ఎట్టకేలకు ఒప్పుకున్నప్పటికీ కత్రినా ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.


Click it and Unblock the Notifications











