కత్రినా కైఫ్ అతిథి .., నేనేమో "ఐటమ్" నా??

కరీనా కపూర్‌, కత్రినా కైఫ్‌లా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే వారు ఐటెం సాంగ్‌లో కనిపించినా అతిథి పాత్రలో నటించారు అని గొప్పగా చెబుతారు. అదే నేను నటిస్తే ఐటెం సాంగ్‌ అంటారు. ఇదెక్కడి న్యాయం?"

Recommended Video

"I Don't Want To Be Labelled An ‘Item Song’ Performer" Daisy Shah Says

జైహో సినిమాతో ఇండస్ట్రీలో హాట్‌గాళ్‌గా మారిన ఆ భామ డైసీ షా. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా ఉన్న ఈ అమ్మడికి హటాత్తుగా సల్మాన్‌ఖాన్‌ పక్కన నటించే ఛాన్స్‌ వచ్చింది? అదెలా? అసలీ డైసీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? .. స్టాలిన్‌ రీమేక్‌గా హిందీలో నిర్మిస్తున్న సినిమా జైహో..! యాంగ్రీ మిలటరీ మెన్‌గా సల్మాన్‌ నటించగా ఈ కండలవీరుడికి జోడీగా డైసీ షా కనిపించింది...

 ఒకే ఒక్క సినిమాతో

ఒకే ఒక్క సినిమాతో

ఒకే ఒక్క సినిమాతో హిందీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది డైసీ... బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ గణేష్ ఆచార్యకు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్ అయిన డైసీ గతంలో కొన్ని సినిమాల్లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది.. కన్నడలో తెరంగేట్రం చేసినా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు.. అలాంటిది సల్లూభాయ్‌ దృష్టిలో పడి ఏకంగా బంపర్ ఆఫరే కొట్టేసింది.

హేట్‌ స్టోరీ 3

హేట్‌ స్టోరీ 3

ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కొంతకాలం తర్వాత ‘హేట్‌ స్టోరీ 3' చిత్రంలో నటించింది. ఆ సినిమా అంతగా గుర్తింపునివ్వలేదు. తాజాగా ఆమె తన కెరీర్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఏదైనా సినిమాలో స్టార్ హీరోయిన్ ఓ ప్రత్యేక పాటలో నటిస్తే.. అతిథి పాత్ర అంటారు.. అదే వేరేవరైనా చేస్తే ఐటెం సాంగ్‌లో నటించింది అంటారు.

 ఐటెం గర్ల్‌

ఐటెం గర్ల్‌

ఇదే విషయం డైసీ షాకి చాలా ఆగ్రహం తెప్పించింది. డైసీ షా ఈ విషయంపై మండి పడుతోంది. ఏదన్నా సినిమాలో ఓ ప్రత్యేక పాటలో కనిపిస్తే తనని ఐటెం గర్ల్‌ అని సంబోధిస్తున్నారని అదే కత్రినాకైఫ్‌ కానీ కరీనాకపూర్‌ కానీ చేస్తే అతిథి పాత్ర అని పొగుడుతున్నారని పేర్కొంది.

 కరీనా కపూర్‌, కత్రినా కైఫ్‌లా

కరీనా కపూర్‌, కత్రినా కైఫ్‌లా

కరీనా కపూర్‌, కత్రినా కైఫ్‌లా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే వారు ఐటెం సాంగ్‌లో కనిపించినా అతిథి పాత్రలో నటించారు అని గొప్పగా చెబుతారు. అదే నేను నటిస్తే ఐటెం సాంగ్‌ అంటారు. ఇదెక్కడి న్యాయం?" అంటూ ఆవేశ పడింది ఇకపై తాను ఐటెం సాంగ్స్‌లో కనిపించనని. కేవలం అతిథి పాత్రల్లోనే నటిస్తానని పేర్కొంది. తనకంటూ ఓ గొప్ప స్థానం సంపాదించుకోవడమే తన గోల్ అని స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X