సెక్సీ యోగాకి దూరం అని తేల్చేసింది
హీరోయిన్స్ సెక్సీ యోగా వీడియోల్లో నటించి విడుదల చేయటం బాలీవుడ్ లో సంప్రదాయంగా మారిన సంగతి తెలిసిందే. అయితే వీటికి తాను విరుద్ధమని ప్రకటించింది బాలీవుడ్ అందాల రాశి కత్రి నాకైఫ్. గతంలో శిల్పాశెట్టి, బిపాసాబసు తరహాలో ఆమెకు యోగా క్యాసెట్స్ అనుమతి ఇవ్వాలని ఓ బడా కంపెనీ పంపిన ప్రతిపాదనలను పంపింది. ఆ ప్రతిపాదలను కత్రినా కైఫ్ తిరస్కరించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ - నిజానికి నాకు యోగాతో పెద్దగా పరిచయం లేదు. యోగాలో శిల్పాశెట్టి స్ధాయికి వెళ్లిన రోజున నేను ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తాను అంది. అలాగే మినిమం మూడేళ్లపాటు తాను రెగ్యులర్ గా జిమ్ లో చేస్తున్న వర్కవుట్ లు ఆపుచేసి, యోగాని ప్రాక్టీస్ చేయగలిగితేనే అందులో పరఫెక్షన్ వస్తుందని ఆమె చెప్పుకొచ్చింది.
ఈ సంవత్సరం ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసిన భారతీయులలో కత్రినాకైఫ్ మొదటి ప్లేసులో ఉన్నారు. ఆ తర్వాత ప్లేస్ లో అన్నా హజారే వచ్చారు. ఈ 2011 సంవత్సరంలో గూగుల్ సెర్చింగ్ ద్వారా ఏయే వ్యక్తుల గురించి,ఏయే అంశాలు గురించి నెటిజన్లు ఎక్కువ వెతికారు అన్న లెక్కల జాబితాను గూగుల్ విడుదల చేసింది. అందులో కరీనా కపూర్ ని దాటి కత్రినా మొదటి ప్లేస్ కి వచ్చింది. అలాగే అన్నాహజారే సైతం మిగతా వారికి పోటికి నిలిచి సెకెండ్ ప్లేస్ లో నిలిచారు. అలాగే అతి వేగంగా వార్తల్లో పైకెదిగిన వ్యక్తిగా సైతం అన్నా హజారేనే నిలిచి రికార్డు క్రియేట్ చేసారు.


Click it and Unblock the Notifications











