భారతీయత నిరూపించుకోవడం కోసం కత్రినా పాట్లు
సంగం భారతీయురాలు మాత్రమే అనే విమర్శలు ఎదుర్కొంటున్న....బాలీవుడ్ తార క్రతినా కైఫ్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ విమర్శలను తిప్పకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ సరిహద్దుల్లో పని చేస్తున్న జవాన్లను కలిసి వారితో మమేకమైంది. వారు రోజు చేసే కార్య్రకమాల్లో పాలు పంచుకుంది. ఎకె 47 రైఫిల్ఎక్కుపెట్టడంతో పాటు బైక్ రైడింగ్, రోప్ ఆదారంగా గోడలు ఎక్కడం లాంటివి చేసి జనవాన్లను ఉత్సాహ పరిచింది. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ....దేశంలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే వారు జనవాన్ల తర్వాతే అని చెప్పుకొచ్చింది. తాను నిఖార్సయిన భారతీయురాలినని, దేశం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేసింది.
లండన్ లో పుట్టి పెరిగిన కత్రినాకైఫ్ తండ్రి ఇండియన్ కాగా, తల్లి బ్రిటిష్ జాతీయురాలు. ఈ నేపథ్యంలో ఆమె పూర్తి భారతీయురాలు కాదంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య కత్రినా...రాహుల్ గాంధీ కూడా నా టైపే కాదా? నాపై మత్రమే అలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారంటూ ఓ టీవీ కార్యక్రమంలో పశ్నించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











