సమస్యల్లో ఉన్నవారి కోసం కత్రినా వెబ్‌సైట్

By Bojja Kumar

బాలీవుడ్ భామ కత్రినా కైప్ త్వరలో ఓ వెబ్ సైట్ ను ప్రారంభించే ఆలోచన ఉందట. వెబ్ సైట్ అంటే పూనమ్ పాండే లాగా, ఇతర బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల మాదిరి తమకు తాము డబ్బా కొట్టుకుంటూ, అక్కర్లేని సొల్లు కబుర్లు చెబూతూ, తన అందాల ప్రదర్శకు వేదిక ఉపయోగించుకునేది మాత్రం కాదండోయ్. సమస్యల్లో ఉన్న మహిళలకు సహాయం చేయడంలో భాగంగా కత్రినా ఈ వెబ్ సైట్ ప్రారంభిస్తుందట. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించేందుకు కత్రినా సిద్దం అవుతోందని సమాచారం.

ఎవరికీ చెప్పుకోలని సమస్యలు, మహిళలు ఏయే సమస్యలపై ఎవరిని సంప్రదించాలి, ఆపదల్లో ఉన్న వారికి సాయం చేసే తదితర బాధ్యతలను ఈ వెబ్ సైట్ ద్వారా నిర్వహించాలనే కత్రినా ఉన్నట్లు బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద కార్య్రకమాలు నిర్వహిస్తూ వస్తున్న కత్రినా...తాజాగా వెబ్ సైట్ ప్రారంభించే ఆలోచనలో ఉండటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆమెకు అందమైన రూపమే కాదు, అందమైన మనసు కూడా ఉందని పొగిడేస్తున్నారంతా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X