ఆ హీరోలతో రొమాన్స్ అంటే వాంతికొచ్చేది: కత్రినా కైఫ్
హైదరాబాద్: వెండి తెరపై హీరో హీరోయిన్లు రొమాంటిక్ సీన్లు చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. ఆ సీన్లు బాగా పండితే సినిమా హిట్టే. అయితే తెరపై కనిపించేది అంతా నిజం కాదు. కేవలం నటన మాత్రమే. వృత్తి ధర్మం కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా....దర్శకుడు చెప్పినట్లు చేయాల్సిందే.
ఇలాంటి సన్నివేశాలు చేసేప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది అనిపించినా చేయక తప్పదు. బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఇలాంటి సన్నిశాలు చేప్పుడు తనకు ఎదురై చేదు అనుభవాలను ఇటీవల వెల్లడించింది. కత్రినా కైఫ్ ఇప్పటి వరకు ఎక్కువగా స్టార్ హీరోల సరసనే నటించింది. వారిలో కొందరు హీరోలు స్నానం లాంటివి ఏమీ చేయకుండా నేరుగా సెట్స్ కు వచ్చి మేకప్ వేసుకుని షూటింగులో పాల్గొనే వారట.

రాత్రి పార్టీల్లో పాల్గొన్ని, ఉదయాన్నే లేచి స్నానం కూడా చేయకుండా రావడం వల్ల వారి నుండి విపరీతమైన కంపు వాసన వచ్చేదట. కనీసం డియోడరెంట్ కూడా వాడే వారు కాదట. అలాంటి వారితో రొమాంటిక్ సీన్లు చేసేప్పుడు వాంతికొచ్చినట్లు ఉండేదని, షూటింగ్ కాబట్టి నరకం అనిపించినా భరించేదాన్ని అని చెప్పుకొచ్చింది కత్రినా. అయితే సౌత్ హీరోలను మాత్రం కత్రినా ప్రశంసలతో ముంచెత్తింది. సెట్స్ లో వారు ఎంతో హుందాగా, నీట్ గా ఉండే వారు అని ప్రశంసిస్తోంది. మరి వాంతికొచ్చే అవతారంతో సెట్స్‌కి వచ్చే వారు ఎవరు? అంటే మాత్రం పేర్లు చెప్పడానికి నిరాకరిస్తోంది కత్రినా.


Click it and Unblock the Notifications











