twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి ఆదేశించాడు.. కట్టప్ప పాటించాడు.. ఇంకేముంది రచ్చ రంబోలా..

    By Rajababu
    |

    Recommended Video

    బాహుబలి ఆదేశించాడు.. కట్టప్ప పాటించాడు..!

    బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన డైలాగ్. కేవలం సినిమా రంగానికే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఈ ప్రశ్నకు అనూహ్యమైన స్పందన వచ్చింది. బాహుబలి చిత్రంలో బ్రహ్మండమైన జోడిగా నిలిచిన ప్రభాస్, సత్యరాజ్‌కు నిజ జీవితంలో మంచి సంబంధాలున్నాయనే విషయం తాజా సంఘటనతో రుజువైంది. ప్రభాస్ మాటను తప్పకుండా పాటించానని సత్యరాజ్ చెప్పిన మీడియాలో ప్రముఖంగా మారింది. ఎంతకీ ఏమైందంటే..

    మిర్చితో మొదలై బాహుబలితో

    మిర్చితో మొదలై బాహుబలితో

    కొరటాల శివ రూపొందించిన మిర్చి చిత్రంతో సత్యరాజ్‌తో ప్రభాస్ బంధం మొదలైంది. ఆ తర్వాత బాహుబలితో వారి రిలేషన్ పీక్స్ చేరింది. కేవలం వారి రిలేషన్ వ్యక్తిగతం అనుకుంటే పొరపాటే. వృత్తిపరంగా కూడా వారి మధ్య మంచి సంబంధాలున్నట్టు స్పష్టమైంది.

     క్షణం సినిమా గురించి

    క్షణం సినిమా గురించి

    రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనను కట్టప్ప సత్యరాజ్ మీడియాకు ఇటీవల వెల్లడించారు. బాహుబలి సినిమా షూటింగ్‌లో మేమంత బిజీగా ఉన్నాం. అప్పుడు నా కుమారుడు శిబిరాజ్ నాకు ఫోన్ చేసి తెలుగులో విజయం సాధించిన క్షణం గురించి చెప్పాడు. ఆ సినిమా గురించి ప్రభాస్‌ను అడిగితే మంచి రెస్పాన్స్ ఇచ్చాడు.

     తమిళంలోకి క్షణం మూవీ

    తమిళంలోకి క్షణం మూవీ

    క్షణం సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని అనుకొంటున్నాం. మీ అభిప్రాయం చెప్పండి అని ప్రభాస్‌ను అడిగాను. అందుకు ఆ సినిమా చాలా మంచి సినిమా మీరు తీసుకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. రీమేక్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ప్రభాస్ సలహా ఇచ్చాడు.

     తమిళ క్షణం త్వరలో రిలీజ్

    తమిళ క్షణం త్వరలో రిలీజ్

    ప్రభాస్ సలహా, సూచనల మేరకు తాము క్షణం సినిమా హక్కులను కొనుగోలు చేశాం. తమిళ క్షణం సినిమా చాలా వచ్చింది. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కాబోతున్నది అని సత్యరాజ్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా తమిళ క్షణం సక్సెస్ సాధిస్తుందనే ధీమాను కట్టప్ప వ్యక్తం చేశాడు.

    English summary
    Baahubali Prabhas and Kattappa Satyaraj has good releations. Their journey started with Mirchi movie and it reached to Peak with Baahubali. In this situation Satya Raj asked a advice Prabhas about Telugu Kshanam movie into Tamil remake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X