మరో వివాదంలో చిక్కుకున్న కత్తి మహేష్.. రామ్ గోపాల్ వర్మ సినిమాపై ఎఫెక్ట్

కాంట్రవర్సీ కామెంట్స్ ద్వారా వివిధ రకాల వివధాలతో సతమతయ్యే కత్తి మహేష్ మరోసారి రాముడిపై కామెంట్స్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. గతంలో అనేక రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నగర బహిష్కరణతో వార్తలతో నిలిచిన కత్తి మహేష్ మరోసారి అదే తరహా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. అయితే ఆ ఎఫెక్ట్ రామ్ గోపాల్ వర్మ సినిమాపై పడినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లో ప్లాన్ చేసుకొని షూటింగ్ నిర్వహిస్తుండగా ఊహించని విధంగా షూటింగ్ కి బ్రేక్ పడింది.

దేవుళ్లపై కామెంట్స్ చేస్తూ..

దేవుళ్లపై కామెంట్స్ చేస్తూ..

సినీ క్రిటిక్ గా పిలవబడే కత్తి మహేష్ గత కొంత కాలంగా సినిమాలలో కూడా స్పెషల్ పాత్రలతో కనిపిస్తూ బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. మొదట పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసి బాగానే క్రేజ్ అందుకున్న కత్తి కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. ఇక అప్పుడప్పుడు దేవుళ్లపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తున్నాడు.

రాముడిపై అనుచిత వ్యాఖ్యలు

రాముడిపై అనుచిత వ్యాఖ్యలు

ఇటీవల మరోసారి కత్తి మహేష్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని హిందు సంఘాలు పోలీస్ కేసు నమోదు చేశాయి.శుక్రవారం రోజు కత్తి మహేష్ ని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా కించపరించేలా కామెంట్స్ చేశాడని కేసు నమోదు చేశారు పలు హిందు సంఘాల నాయకులు.

రామ్ గోపాల్ వర్మ సినిమాపై ఎఫెక్ట్..

రామ్ గోపాల్ వర్మ సినిమాపై ఎఫెక్ట్..

అయితే కత్తి మహేష్ ని అరెస్ట్ చేయడంతొ ఆ ఎఫెక్ట్ రామ్ గోపాల్ వర్మ సినిమాపై పడింది. ప్రభు దర్శకత్వంలో షకలక శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న రామ్ గోపాల్ వర్మ షూటింగ్ గత కొన్ని రోజుల క్రితం మొదలైంది. ఓటీటీలో విడుదల చేసేందుకు సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే అందులో కత్తి మహేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Recommended Video

#NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look
14 రోజుల రిమాండ్..

14 రోజుల రిమాండ్..

ఇక దాదాపు షూటింగ్ ఏండింగ్ లో ఉందనగా సడన్ గా కత్తి మహేష్ అరెస్ట్ కి గురయ్యాడు. శుక్రవారం కేసు నమోదు కాగానే కత్తి మహేష్ ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లి అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనిని 14రోజుల రిమాండ్ కి తరలించినట్లు తెలుస్తోంది. దీంతో రామ్ గోపాల్ వర్మ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X