అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు?: మళ్ళీ ప్రశ్నించిన కత్తిమహేష్

వీడియోలో కేవలం హైపర్ ఆది చేసిన పనికి మాత్రమే రియాక్షన్ ఇచ్చిన కత్తి మహేష్ తాజాగా ఓ ఛానెల్ టాక్ షోలో పాల్గొన్న వీడియోలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ని మరోసారి విమర్శించాడు.

Recommended Video

మళ్ళీ పవన్ ని ప్రశ్నించిన కత్తిమహేష్

జబర్దస్థ్ షోలో హైపర్ ఆది చేసే స్కిట్ లకి కాస్త ఫాలోయింగ్ ఎక్కువే, దాదాపు వాట్సాప్, ఫేస్బుక్లలో వచ్చే జోకులనే కాపీకొట్టి "పంచ్" లుగా వాడే ఆదీ స్కిట్స్లో గతం లోనే రామ్‌గోపాల్ వర్మ మీద కూడా సెటైర్లు వేసాడు... రాత్రి బోరుకొడితే ఓడ్కా బాటిల్ ఓపెన్ చేసి ట్విట్టర్ ఓపెన్ చేస్తాడంటూ ఇన్‌డైరెక్ట్ గా రామ్‌గోపాల్ వర్మ మీద వేసిన సెటైర్లకే ఆది మీద కొంత వ్యతిరేకత వచ్చింది జనాల్లో.

కత్తిపై హైపర్ ఆది పంచ్‌లు

కత్తిపై హైపర్ ఆది పంచ్‌లు

రీసెంట్‌గా జబర్ధస్త్ షోలో కత్తిపై హైపర్ ఆది పంచ్‌లు పేల్చిన విషయం తెలిసిందే. ముందు పొట్ట, వెనుక బట్ట అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ తాజాగా కత్తి మహేష్ ఓ వీడియోని విడుదల చేశాడు. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని కత్తి మహేష్ రెచ్చిపోయినట్లే, హైపర్ ఆది కూడా ఆ డైలాగ్‌తో చెలరేగిపోయాడు.

తేడాని మాత్రం ఆది గమనించనట్టే ఉంది

తేడాని మాత్రం ఆది గమనించనట్టే ఉంది

అయితే వాక్ స్వాతంత్రానికి ఉండే తేడాని మాత్రం ఆది గమనించనట్టే ఉంది. మరీ పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడటం సహజంగానే కత్తికి కాస్త చిరాకు తెప్పించింది.మెగా ఫ్యామిలీకి ఎవరు ఆపోజిట్ లో ఉన్నా వాళ్ళే హైపర్ ఆది స్కిట్లో నెక్స్ట్ టార్గెట్. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ దగ్గర్నుంచీ మహేష్ కత్తి ఎదుర్కుంటున్న సమస్యలు మనందరికీ తెలిసినవే.

కత్తిని టార్గెట్ చేస్తూ స్కిట్

కత్తిని టార్గెట్ చేస్తూ స్కిట్

ఇదే సమయం లో హైపర్ ఆది కూడా మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ ఒక స్కిట్ వేసాడు. ఈ పంచ్ లు తనను ఉద్దేశించి ఉన్నాయంటూ కనెక్ట్ అయ్యాడు కత్తి. తనకు పొట్ట ఉందని.. బట్ట ఉందని.. మనుషులంతా ఒక్కటేలా ఉంటారా? అంటూ క్వశ్చన్ వేయటమే కాదు.. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారని.. ఆ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉండటమే ప్రపంచమన్నాడు.

మరోసారి విమర్శించాడు

మరోసారి విమర్శించాడు

ఆ వీడియోలో కేవలం హైపర్ ఆది చేసిన పనికి మాత్రమే రియాక్షన్ ఇచ్చిన కత్తి మహేష్ తాజాగా ఓ ఛానెల్ టాక్ షోలో పాల్గొన్న వీడియోలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ని మరోసారి విమర్శించాడు. ప‌వ‌న్ అభిమానులు బెదిరించిన‌ప్పుడు మీడియా ముందుకు వ‌చ్చి మరీ దీనిపై ఆయన స్పందించాలని కోరాను.

కళ్యాణ్ స్పందించకుండా

కళ్యాణ్ స్పందించకుండా

కానీ పవన్ కళ్యాణ్ స్పందించకుండా, ఆయన సేఫ్ గేమ్ ఆడతాడని మరోసారి నిరూపించారు. ఇక్కడే ఆయన మ‌న‌స్త‌త్వం తెలిసిపోయింది. ఇదంతా చూస్తుంటే ఆయనే కావాలని అభిమానులు చేస్తున్న ఈ వికృత చేష్ట‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నట్లుందని కత్తి మహేష్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

విషయమే తనకు తెలియదు అన్నట్లు

విషయమే తనకు తెలియదు అన్నట్లు

అభిమానులు చేస్తున్న ఈ చేష్టలను ఖండించకుండా సైలెంట్‌గా ఉంటున్నారంటే అదేగా అర్ధం అని మ‌హేశ్ క‌త్తి ఆరోపించాడు. అసలు ఈ విషయమే తనకు తెలియదు అన్నట్లుగా పవన్ వ్యవహరిస్తున్నారని, ఇదంతా చూస్తుంటే పవనే కావాలని అభిమానులను రెచ్చగొడుతున్నట్లుందని.. మరోసారి పవన్‌పై కత్తి కామెంట్స్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X