ఆమె నా ప్యాంట్ కిందకు లాగేసి తన ఫ్రెండ్స్‌కి చూపించింది.. నటుడి సంచలన వ్యాఖ్యలు
Recommended Video
లైంగిక వేధింపు మహిళలకే కాదు.. పురుషులకూ ఉంటాయని అంటున్నాడు హాలీవుడ్ నటుడు జోష్ క్లోజ్. ఈ మేరకు ఆయన #SheToo పేరుతో తనపై ఓ గాయని చేసిన వికృత చర్యలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. చాలా ఏళ్ల క్రిందట జరిగిన సంఘటన అయినప్పటికీ ఆయన చేసిన ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇంతకీ నటుడు జోష్ క్లోజ్ చెప్పిన సంగతులేంటి? ఆ గాయని ఎవరు? వివరాల్లోకి పోతే..

ప్రముఖ గాయనితో కలిసి టీనేజ్ డ్రీమ్
ప్రముఖ గాయని క్యాటీ పెర్రీతో కలిసి టీనేజ్ డ్రీమ్ అనే ప్రైవేట్ వీడియోలో నటించాడు అమెరికాకు చెందిన నటుడు జోష్ క్లోస్. 2010 సంవత్సరంలో విడుదలైన ఈ వీడియో సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత గాయని క్యాటీ పెర్రీపై జోష్ క్లోస్ సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

ఓ రోజు పార్టీలో ఇలా చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్
ఓ రోజు పార్టీలో పాల్గొనగా ఊహించని రీతిలో ఆమె తన ఫ్యాంట్ లాగేసి అక్కడున్న వారందరికీ చూపించిందని ఆయన ఆరోపించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టిన జోష్ క్లోజ్.. గాయని క్యాటీ పెర్రీ చేసిన ఆ పని తనకెంతో బాధ కలిగించిందని పేర్కొన్నాడు.
మొదట బాగానే ఉంది.. కానీ ఆ తర్వాతే మెల్లగా
'టీనేజ్ డ్రీమ్' వీడియో చిత్రీకరణ సందర్భంగా ఆమెను కలిసినప్పుడు మొదట చాలా మంచి వ్యక్తిగా కనిపించిందని, షూటింగ్ మొదలైన రోజు నుంచే తనలోని భావాలను బయటపెడుతూ తనలో కోరికలు కలిగేలా చేస్తూ వచ్చిందని ఆయన తెలిపాడు. తనను క్లబ్ కి కూడా రావాలంటూ ఒత్తిడి తెచ్చేదని చెప్పాడు. అయితే ఆ సమయంలో తనకు నటుడిగా గుర్తింపు లేదు కాబట్టి ఈ విషయం బయటకు చెప్పలేక పోయానని జోష్ క్లోజ్ వెల్లడించాడు.

డబ్బు కోసం చేసే ఆరోపణలు కాదు
తాను చేస్తున్న ఈ ఆరోపణలు డబ్బు కోసం కాదని అన్నాడు జోష్ క్లోజ్. అలా చేయాలనే ఆలోచనే ఉంటె కెరీర్ ఆరంభంలో తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలోనే ఈ విషయం బయటపెట్టి డబ్బు డిమాండ్ చేసేవాడినని ఆయన అన్నాడు. లైంగిక వేధింపులు కేవలం ఆడవాళ్లకే కాదు మగాళ్లకు కూడా ఉన్నాయని తెలిపేందుకే ఈ విషయం బయటపెడుతున్నాని ఆయన పేర్కొన్నాడు. చూడాలి మరి ఈ ఇష్యుపై గాయని క్యాటీ పెర్రీ స్పందిస్తుందా? లేదా? అనేది.


Click it and Unblock the Notifications