హీరోయిన్ ప్రేమ లేఖ వేలానికి పెట్టారు!
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ గాయని కేటీ పెర్రీ 11 ఏళ్ల వయసులో రాసిన ప్రేమ లేఖను వేలానికి పెట్టనున్నారు. ఆమె స్కూల్లో చదువుకునే రోజుల్లో క్రిస్టోఫర్ అనే అబ్బాయిపై మనసు పారేసుకుంది. ఆ వయసులో తన తెలిసిన విధంగా ప్రేమ లేఖ రాసింది. 1995లో కేటీ పెర్రీ ఈ ప్రేమ లేఖ రాసింది.
జూలియెన్స్ సంస్థ ఈ ప్రేమల లేఖను వచ్చే నెల వేలం వేయబోతోంది. ఈ వేలంలో ఈ ప్రేమలేఖ ప్రారంభ ధర 800 డాలర్లుగా నిర్ణయిస్తారని సమాచారం. కేటీ పెర్రీ అభిమానులు ఈ లేఖను వేలంలో కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున పోటీ పడతారని తెలుస్తోంది. ఈ లేఖ ఎంత వసూలు చేస్తుందనేది హాట్ టాపిక్ అయింది.

కేటీ పెర్రీ వయసు ప్రస్తుతం 29. 2010లో ఆమె వివాహం రస్సెల్ బ్రాండ్ తో జరిగింది. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవ లేదు. 2012లో విడిపోయారు. అప్పటి నుండి కేటీ పెర్రీ సింగిల్ గానే ఉంటోంది.


Click it and Unblock the Notifications











