twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌ పతిలో స్వల్ప మార్పులు....!

    By Nageswara Rao
    |

    బాలీవుడ్ రారాజు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎంతో ఇష్టపడి చేసిన రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. ఈ రియాల్టీ షో వల్ల అమితాబ్ తిరిగి కోల్పోయిన పూర్వవైభవం మరలా తిరిగిపోందారు. అంతేకాకుండా తనకంటూమరలా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు 3 కౌన్ బనేగా కరోడ్‌పతి రియాల్టీ షోలు చేయడం జరిగింది. దీని ద్వారా అమితాబ్ యావత్ భారతదేశం ప్రజల గుండెల్లో అలా ఇంకోసారి నిలిచిపోవాలని సీజన్-4ని మరలా ప్రారంభించాలని అనుకుంటున్నారు. దీనితో బుల్లితెర అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రముఖ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఇది వరకు సోనీ టెలివిజన్ ఛానెల్ బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హొస్ట్‌గా నిర్వహించి టెలివిజన్ ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన "కౌన్ బనేగా కరోడ్‌పతి" అనే రియాల్టీ షో తిరిగి ప్రారంభం కానుంది. ఈ సీజన్-4 ప్రోగ్రామ్‌కు కూడా "బిగ్ బి"నే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఇటీవల వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే.

    ఈ కార్యక్రమాన్ని అమితాబ్ పుట్టిన రోజైన అక్టోబర్ 11న ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కెబిసి సీజన్-4 ప్రైజ్ మనీ ఎంతో తెల్సా.. అక్షరాల ఐదు కోట్ల రూపాయలు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ..ఇది వరకు నిర్వహించిన షో మాదిరిగానే ఇది కూడా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిగే మొట్టమొదటి 12 ప్రశ్నలకు ప్రైజ్ మనీ ఒక కోటి రూపాయలు, చివరి ప్రశ్నకు మాత్రం రూ. 5 కోట్లు. ఇందులో ఓ ప్రత్యేక లైఫ్ లైన్ "ఆస్క్ యాన్ ఎక్స్‌పెర్ట్" ను పరిచయం చేయనున్నారు. మిగిలిన రెండు లైఫ్ లైన్లలో ఎలాంటి మార్పు ఉండదు. "ఆడియన్స్ పోల్", "ఆస్క్ ఏ ఫ్రెండ్"లో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యధావిధిగానే ఉంటాయన్నారు. ఇదివరకు ఉన్న 50:50 లైఫ్ లైన్‌ను మాత్రం ఈ ప్రోగ్రామ్ నుంచి తొలగించడం జరిగందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందు దేశవ్యాప్తంగానే గాక ప్రపంచంలోని బిగ్ బి అభిమానులు సైతం "కోటి" కళ్లతో వేచి చూస్తున్నసంగతి అందరికి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X