»   » ‘కౌన్ బనేగా కరోడ్ పతి’షో : శ్రీదేవితో తెలుగులో?

‘కౌన్ బనేగా కరోడ్ పతి’షో : శ్రీదేవితో తెలుగులో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా హిందీ టీవీ ఛానల్స్‌లో మొదలైన 'కౌన్ బనేగా కరోడ్ పతి' రియాల్టీ షోకి ఎంత పాపులారిటీ వచ్చిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది కానీ....హిందీ భాష కావడంతో సౌత్ ప్రేక్షకులు ఈ ఈ కార్యక్రమానికి ఎక్కువగా కనెక్ట్ కావడం లేదు.

దీంతో దక్షిణాది భాషల్లోనూ ఈ కార్యక్రమం రూపొందించాలని ప్లాన్ చేసారు. ఇప్పటికే తమిళంలో సూర్య, ప్రకాష్ రాజ్‌లతో ఈ షో ప్రారంభం అయింది. తాజాగా ఈ కార్యక్రమం తెలుగులోనూ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం....తెలుగులో ప్రముఖ హీరోయిన్ శ్రీదేవితో ఈ కార్యక్రమం త్వరలో మొదలు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

Sridevi

పెళ్లయి పిల్లు పుట్టాక సినిమాలకు పూర్తిగా దూరమైన శ్రీదేవి....దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తీసుకుని 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా ఇటీవల రీ ఎంట్రి ఇచ్చింది. ఇప్పటికే శ్రీదేవి అందం చెక్కు చెదరక పోవడంతో సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన గ్లామర్ ప్రదర్శిస్తోంది ఈ ప్రౌడ సుందరి.

ఇప్పటికే సీసీఎల్‌(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో ఓ ఫ్రాంచైజీ సొంతం చేసుకుని సినిమా రంగంలో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న శ్రీదేవి...ఇక బుల్లితెరపై తన సత్తా చాటాలని నిర్ణయించుకుందని, అందులో భాగంగానే తెలుగులో 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

English summary
Film Nagar rumor is that, Sridevi will make her small screen debut with the Telugu version of the famous quiz show Kaun Banega Krorepati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu