శృంగార తారగా తెలుగులో వెలుగుతున్న కౌష ప్రస్తుతం కామిడీ మిక్స్ చేసిన ఓ సస్పెన్స్ థిల్లర్ లో ఫ్రధాన పాత్రను పోషిస్తోంది. బుజ్జి నాయుడు అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ 'డే టు డే'. కథ ఓ సినిమా షూటింగ్ సమయంలో యే రోజుకా రోజు కి జరిగే కథట. మనో నేత్ర క్రియేషన్స్ పతాకంపై ఎల్.సి.హెచ్ గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా పస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. చైతన్య గణేష్ కథ,డైలాగులు సమకూరుస్తున్న ఈ సినిమాకు సాహిత్ సంగీతం,కళ్యాణ్ కెమెరా అందిస్తున్నారు. ఇక టైటిల్ లాగే సినిమా చాలా చిత్రంగా చిత్ర పరిశ్రమ చుట్టూ జరిగే సంఘటనలును కళ్ళకు కట్టినట్టు చూపెడుతుందని, కౌష గ్లామర్ ప్లస్ అవుతుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.