‘కిరిటం’ కోసం అందలాను ఆరబోసిన హీరోయిన్...
అభినయ శ్రీ ప్రధానపాత్రలో వేదవ్యాస్ హీరోగా శ్రీచిన్నగోవిందా మూవీమేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'కిరీటం'. ఎన్.వెంకటకృష్ణ స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ కౌష ఈ చిత్రం కోసం ఓ ఐటం సాంగ్ చేయడం విశేషం. ఇటీవల ఆ పాటను నృత్య దర్శకుడు నిక్సన్ కంపోచేసి చిత్రీకరించారు.
ఆ విశేషాలు దర్శకుడు ఎన్.వెంకటకృష్ణ మాట్లాడుతూ..'గీతామాధురి గళంలోని 'పొయ్ పొయ్..పోసెయ్‌రా మందు..' అంటూ సాగే పాటను హైదరాబాద్ పరిసరాల్లో డాన్సర్లతోపాటు కౌష పై చిత్రీకరించాం. నిక్సన్ నృత్యాలు అందిం చారు. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. నెలాఖరున పాట లు విడుదల చేస్తాం. జానపదుల కాలంలో రాజా వెంకటపతిరాయల ఆస్థానంలో సాగిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. దండకారణ్య నేపథ్యముంటుంది. జానపద నేపథ్యానికి గ్రాఫిక్స్ జతచేసి అద్భుతంగా మలుస్తున్నాం' అన్నారు. ఈ చిత్రానికి భాస్కర్ చక్కటి సంగీతాన్ని అందించగా, అభినయశ్రీ వేదవ్యాస్, గిరిబాబు, జీవా, బ్రహ్మానందం, హేమ తదితరులు నటించనున్నారు.


Click it and Unblock the Notifications











